పిల్లి పోయింది..25 రోజులుగా ఏపీలో వెతుకుతున్నారు?

Update: 2019-07-08 05:07 GMT
మూగ‌జీవాల్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకునే వారు కొంద‌రుంటారు. ఇంట్లో కుటుంబ స‌భ్యులుగా వారు భావిస్తుంటారు. వాటికి ఏమైనా అయితే విల‌విలాడిపోతారు. అలాంటి ఉదంత‌మే ఒక‌టి తాజాగా చోటు చేసుకుంది. గుజ‌రాత్ రాష్ట్రంలోని సూర‌త్ న‌గ‌రానికి చెందిన జ‌యేష్ బాయి.. మీనా బెన్ దంప‌తులు గ‌త నెల 9న (జూన్) తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చారు.

త‌మ వెంట తామెంతో అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లి (బాబు)ని కూడా వెంట తెచ్చుకున్నారు. తిరుమ‌ల స్వామి వారి ద‌ర్శ‌నం పూర్తి అయి.. త‌మ ఊరికి వెళ్లే క్ర‌మంలో వారు రేణిగుంట స్టేషన్లో త‌మ పిల్లిని మిస్ చేసుకున్నారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు.. ప్లాస్టిక్ బుట్ట‌లో ఉన్న పిల్లిని తీసుకొని వెళ్లిపోయారు.

దీంతో వారు తీవ్ర మ‌నోవ్య‌ధ‌కుగుర‌య్యారు. పోయిన పిల్లి కోసం విప‌రీతంగా వెతుకుతున‌నారు. రేణిగుంట రైల్వే పోలీసుల‌కు ఫిర్యాదు ఇచ్చారు. అయితే.. దాన్ని వారు తీసుకోలేదు. దీంతో గ‌డిచిన పాతిక రోజులుగా ఈ గుజ‌రాత్ దంప‌తులు పోయిన త‌మ పిల్లిని ప‌ట్టుకునేందుకు వెతుకూత‌నేఉన్నారు. రేణిగుంట‌.. తిరుప‌తి.. తిరుమ‌ల‌.. తిరుచానూరు త‌దిత‌ర ప్రాంతాల్లో త‌మ పిల్లి దొరుకుతుంద‌న్న ఆశ‌తో వెతుకుతున్నారు.

త‌మ పిల్లి ఆచూకీ తెలిసిన వారు ఎవ‌రైనా త‌మ‌కు తెలియ‌జేయాలంటూ 98248 76542 నెంబ‌రు ఇచ్చారు. పిల్లిని గుర్తించేందుకు వీలుగా.. దాంతో దిగిన ఫోటోను వారు షేర్ చేస్తున్నారు. పాతిక రోజులుగా క‌నిపించ‌కుండా పోయిన పెంపుడు పిల్లి కోసం అలానే వెతుకుతున్న వారి తీరు చూస్తే.. దాని కోసం వారెంత‌గా త‌పిస్తున్నారో ఇట్టే అర్థం కాక మాన‌దు. మీరు కానీ.. రేణిగుంట‌..తిరుమ‌ల‌.. తిరుప‌తి.. తిరుచానూరు త‌దిత‌ర ప్రాంతాల‌కు చెందిన వారైతే.. ఆ దంప‌తుల‌కు సాయం చేస్తే మంచిది. 


Tags:    

Similar News