గల్ఫ్ దేశాలు అంటే ఉండే క్రేజే వేరు. ప్రపంచంలో ప్రజలందరికీ ఆక్సిజన్ ఎంత అవసరమైందో నిత్య జీవితం సాఫీగా సాగిపోయేందుకు ఇంధనం ప్రత్యక్షంగా, పరోక్షంగా అంతే అవసరమైంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఇంధన నిల్వలు ఉన్నప్పటికీ భారీ ఆయిల్ నిల్వలతో అగ్రస్థానంలో ఉన్న దేశాలు గల్ప్ దేశాలే. యూఏఈ - ఖతార్ - సౌదీ అరేబియా - కువైట్ - ఒమన్ వంటి గల్ప్ దేశాలు ఇప్పుడు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రపంచాన్ని ఆయిల్ ద్వారా శాసించిన ఈ దేశాలు ఇపుడు అదే అంతర్జాతీయ సమాజంలో చమురు ధరలు తగ్గుతుండటం కారణంగా బిక్కమొహం వేస్తున్నాయి.
అమెరికాలో పెద్ద ఎత్తున చమురు నిల్వలు లభించిన నేపథ్యంలో ప్రపంవ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ ఉండే ఆ దేశం కొనుగోలు ఆపివేసింది. దీంతో పాటు వివిధ కారణాల వల్ల ఏడాది క్రితం బ్యారెల్ 114 డాలర్లున్న చమురు ధర...తాజాగా 41 డాలర్లకు పడిపోయింది. దీంతో గల్ప్ దేశాల్లో పరిస్థితులు తలకిందులు అయ్యాయి. బ్యారెల్ చమురు ధర పుంజుకుని 75 డాలర్లకు చేరని పక్షంలో గల్ఫ్ దేశాల ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి హెచ్చరించింది. ఇంతేకాదు ఆయా దేశాలు పూర్తిగా కోలుకోవాలంటే బ్యారెల్ ధర కనీసం 100 డాలర్లకు చేరుకోవాలని అంచనా వేసింది. అయితే గల్ఫ్ దేశాల్లోని పరిస్థితులు ఇపుడు భారత్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
ఆర్థిక మాంధ్యం సూచనలతో గల్ఫ్ దేశాలు బడ్జెట్ కుదింపు - సబ్సిడీల తగ్గింపు - ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవటంపైనే దృష్టిపెట్టాయి. ఆ దేశాల్లోని కంపెనీలు జీతాలు - ఇంక్రిమెంట్లలో కోత విధించాయి. ఇప్పుడిప్పుడే పలు కంపెనీలు ఉద్యోగస్తుల తొలగింపును మొదలుపెట్టాయి. దీని ప్రభావం భారత్ పై తీవ్రంగా పడనుందని అంచనాలు వెలువడుతున్నాయి. తాజా పరిస్థితులతో.. కంపెనీలు జీతాల్లో కోత విధించటం అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని వివిధ కంపెనీల్లో దాదాపు 70 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. అందులో కేరళనుంచే ఎక్కువమంది ఉన్నారు. కేరళ ప్రజలు తమ రాష్ర్టంలోని ఆప్తులకు పంపించే సొమ్ము ఆ రాష్ట్రానికి కేంద్రం చేసే సహాయానికి 5.5 రెట్లు ఉంటుంది. ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేస్తే...పెద్ద సంఖ్యలో భారతీయులు రోడ్డున పడాల్సి వస్తుంది.
పోనీ అదే దేశంలో ఆయిల్ కంపెనీల్లో కాకుండా వేరే పని ఏదైనా చేసుకొని బ్రతికేయచ్చు అనుకుంటే.... ముస్లిం పాలకుల చేతుల్లో ఉన్న గల్ఫ్ దేశాల్లో కార్మిక చట్టాలు అత్యంత కఠినంగా ఉన్నాయి. అయితే అక్కడే పనిచేయాలి.. లేదంటే భారత్ కు తిరిగొచ్చేయాలి తప్ప ఉద్యోగం మారేందుకు కంపెనీలు సహకరించవు. ఈ నేపథ్యంలో గల్ఫ్ ఆర్థిక పరిస్థితులు స్థిరపడాలని ఆ దేశ ప్రజల కంటే భారత్ అభిమానులే ఎక్కువగా ఆకాంక్షిస్తున్నారు. ఒకవేళ గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వారు భారత్‌కు తిరిగి వస్తే...భారత్ లో నిరుద్యోగ భూతం మరింత విస్తరించడం ఖాయమే.