గుండు సీక్రెట్ రివీల్ చేసిన ఎంపీ అర్వింద్

Update: 2020-12-20 13:30 GMT
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేతలన్నంతనే బండారు దత్రాత్రేయ.. లక్ష్మణ్.. కిషన్ రెడ్డి లాంటి రోజులు పోయాయి. ఇప్పుడు అందరికి గుర్తుకు వచ్చేవారిలో ముందుండేది.. బండి సంజయ్.. ఆ వెంటనే ఎంపీ అర్వింద్. ఫైర్ బ్రాండ్ పేరుకు తగ్గట్లు వ్యవహరించే వీరిలో అర్వింద్ తీరు మొత్తం విలక్షణంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఇంతలా దమ్ముగా మాట్లాడే నేతలే కనిపించరు. మాటల్లో పదును.. ఏ మాత్రం తగ్గని టైమింగ్.. అన్నింటికి మించి వెనుకా ముందు చూసుకోకుండా ప్రత్యర్థులకు మంట పుట్టేలా మాట్లాడటంలో ఆయన తర్వాతే ఎవరైనా.

అలాంటి అరవింద్ అన్నంతనే గుర్తుకు వచ్చేవి రెండే అంశాలు. ఒకటి కళ్లజోడు.. మరొకటి గుండె. ఎందుకో ఆయన ఎప్పుడూ గుండుతోనే కనిపిస్తారన్న మాటే కానీ.. దాని వెనుక విషయం మాత్రం తెలీదు. తాజాగా ఆ రహస్యాన్ని రివీల్ చేశారీ అదిలాబాద్ ఎంపీ. మీరెప్పుడూ గుండుతోనే కనిపిస్తారెందుకు? అన్న ప్రశ్నకు సరదాగా సమాధానం ఇచ్చారు. తన మీద తానే వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసి నవ్వులు పూయించారు.

తాను ఎక్కువగా గుండుతో కనిపించటానికి కారణం తిరుపతి అని చెప్పిన ఆయన.. ఆ పుణ్యక్షేత్రానికి తరచూ వెళ్లటం.. వెళ్లిన ప్రతిసారీ గుండు కొట్టించుకోవటంతో తాను గుండుతో ఉండిపోయినట్లుగా చెప్పారు. ఆయన మాటలు.. చెప్పే తీరు అందరి ముఖాల్లో నవ్వులు పూసేలా చేశాయి. తనకున్న దైవభక్తిని.. తిరుమల శ్రీవారి మీద ఉన్న నమ్మకాన్ని చెప్పకనే చెప్పేసిన అర్వింద్ ఇప్పుడు మరోసారి అందరి మాటల్లో వ్యక్తిగా మారారని చెప్పక తప్పదు.




Tags:    

Similar News