ఆ మంత్రి రాసలీలల్ని తీసిందెవరంటే..

Update: 2016-12-15 07:43 GMT
లేటు వయసులో ఘాటు శృంగారానికి పాల్పడి.. అప్పటివరకూ సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల్ని మొత్తంగా పోగొట్టుకున్న హైచ్ వై మేటి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఏడు పదుల వయసులో.. పాడు బుద్ధిని ప్రదర్శించి.. జాతీయ స్థాయిలో తన ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసుకున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక సిద్ధరామయ్య మంత్రివర్గంలో అత్యంత సీనియర్ మంత్రిగా పేరున్న మేటి.. ఇప్పుడదే ప్రభుత్వానికి పెద్ద గుదిబండలా మారారు.

కర్ణాటక ప్రభుత్వాన్ని ఇరుకున పడేసిన మేటి రాసలీలల్ని షూట్ చేసిందెవరు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పాడు పని చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవటం మామూలే. అలాంటిది అంత ఈజీగా ఎలా బుక్ అయ్యారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. మంత్రిగారి రాసలీలల సీడీని.. గతంలో ఆయన దగ్గర పని చేసిన గన్ మేన్ చేసి ఉంటాడని చెబుతున్నారు.

గతంలో మేటి వద్ద గన్ మేన్ గా పని చేసిన వ్యక్తి.. ఆ తర్వాత మంత్రిపై కక్ష పెంచుకొని.. సమయం కోసం ఎదురుచూసి.. అడ్డంగా బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం 3.23 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో మంత్రి గారి రాసలీలలు స్పష్టంగా ఉండటంతో పాటు.. ఆయన సమాధానం చెప్పుకోలేనట్లుగా ఉన్నట్లుగా చెబుతున్నారు. తొలుత సీడీతో మంత్రిని బెదిరింపులకు గురి చేయాలని సదరు గన్ మేన్ ప్రయత్నించాడని.. అప్పటికి లొంగకపోవటంతో.. చివరకు సమాచార హక్కు చట్టం కార్యకర్తకు సీడీని అందించటం.. అది కాస్తా ఒక టీవీ ఛానల్ చేతికి వెళ్లటంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News