మరో 'ఇప్పటం' ఘటన తెర మీదకు వచ్చింది. ఏపీ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఇప్పటం ఇష్యూ ఒక కొలిక్కి రాకముందే.. అలాంటి ఉదంతమే మరొకటి బయటకు రావటం కలకలాన్ని రేపుతోంది. సరికొత్త రాజకీయ రగడకు వేదికగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏళ్లకు ఏళ్లుగా ఉంటున్న ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు పేరుతో చేపట్టిన కూల్చివేత కార్యక్రమం కొత్త ఉద్రిక్తతలకు తావిచ్చింది. అసలేం జరిగిందంటే?
గుంటూరు సిటీలో చంద్రయ్య నగర్ ను చాలా కాలం క్రితం నిర్మించారు. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన బీ ఫారం స్థలాల్లో చాలామంది పేదలు నివసిస్తున్నారు. ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. 2015లో క్రిష్ణా పుష్కరాల సమయంలో రోడ్ల విస్తరణలో భాగంగా చంద్రయ్య నగర్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కలిపి నోటీసులు ఇచ్చారు. అయితే.. కొందరు కోర్టుకు వెళ్లటంతో అక్రమణల తొలగింపు ఆగింది.
ఇదిలా ఉండగా ఏడేళ్ల క్రితం ఆగిన విస్తరణ పనులు తాజాగా మొదలయ్యాయి. మంగళవారం సాయంత్రం కార్పొరేషన్ సిబ్బంది వచ్చి.. ఇళ్లు తొలగిస్తామని చెప్పటం.. సామాగ్రి తీసుకెళ్లాలని చెప్పటం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత పనులు జరుగుతాయని భావించిన వారికి షాక్ తగిలింది. బుధవారం ఉదయాన్నే పొక్లెయిన్లు.. జేసీబీలు తీసుకొచ్చి కూల్చివేతలు షురూ చేశారు. దీంతో అక్కడ నివాసం ఉంటున్న వారు భోరుమంటున్నారు. 60 ఏళ్ల నుంచి ఉంటున్నామని.. అలాంటిది ఒక్క పూటలో వచ్చి ఖాళీ చేయమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అక్కడి ప్రజల వినతుల్ని పట్టించుకోని అధికారులు కూల్చివేతల్ని ముమ్మరం చేశారు. చివరకు సామాగ్రిని సర్దుకునే సమయాన్ని కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక మహిళ (జయమ్మ) అనే పెద్ద వయస్కురాలు అయితే.. ఇళ్లు కూల్చేస్తే ఎక్కడ ఉండాలని ప్రశ్నిస్తూ.. జేసీబీ తొట్టెలో కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. చంద్రయ్య నగర్ లో దాదాపు 10 ఇళ్లను కూల్చివేయటం.. అప్పుడే టీడీపీ నాయకులు అక్కడకు చేరుకోవటంతో అధికారులు వెనుదిరిగారు. టీడీపీ హయాంలోనూ అక్కడి కొంత ప్రాంతంలో విస్తరణను చేపట్టారని.. ఆ సమయంలో పరిహారం ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు.
తాజాగా మాత్రం కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా.. పరిహారం ఇవ్వకుండానే కూల్చేశారని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. రెండు రోజుల్లో పరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. .హటాత్తుగా ఖాళీ చేయమని చెప్పే కన్నా.. కాస్తంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. ఇప్పటం ఘటనను గుర్తుకు తెచ్చేలా చోటు చేసుకున్నఈ ఉదంతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.