ఇద్దరు సాధ్వీలను రేప్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ ఎట్టకేలకు దోషిగా నిరూపితం కావటం తెలిసిందే. రేప్ ఆరోపణలు నిజమని తేలిన తర్వాత పంజాబ్.. హర్యానా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకోవటం.. పలువురు అమాయకులు గొడవలకు బలి అయ్యారు. తీవ్ర శాంతిభద్రతల సమస్యగా గుర్మీత్ ఇష్యూగా మారింది. తాము ఆరాధించే మత నాయకుడు దోషిగా కోర్టు తీర్పు ఇవ్వటాన్ని ఆయన్ను అభిమానించేవారు.. ఆరాధించేవారు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇదిలా ఉంటే.. తీర్పు సందర్భంగా గుర్మీత్ రియాక్షన్ ఏమిటన్న విషయం బయటకు వచ్చింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న గుర్మీత్.. తీర్పు వెలువడే వేళలో కాస్తంత టెన్షన్ తో ఉన్నట్లుగా చెబుతున్నారు. తీర్పు ప్రతికూలంగా వచ్చి.. దోషిగా నిరూపణ అయ్యిందంటూ జడ్జి తీర్పుతో ఆయన షాక్ తిన్నారట. అసలేం జరుగుతుందో కూడా అర్థం కానంత అయోమయంలోకి పడిపోయారట.
జడ్జి తీర్పును తన లాయర్ వివరించే సమయంలో ఆయన తీవ్రమైన షాక్ కు గురయ్యారట. కాసేపటి వరకూ ఆయన కోలుకోలేదని కోర్టు రూమ్ కు హాజరైన సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హెచ్ పీఎస్ వర్మ పేర్కొన్నారు. విచారణ జరుగుతున్నంత సేపు చేతిలో చేయి వేసుకొని గుర్మీత్ కూర్చున్నట్లుగా చెప్పారు.
ఇద్దరు సీబీఐ అధికారులు.. ఒక ఐజీపీ ర్యాంకు అధికారి.. ఒక సీబీఐ న్యాయవాది.. డిఫెన్స్ లాయర్ తో కలిసి ఆయన అరగంటసేపు కోర్టు హాల్లోనే ఉన్నట్లుగా చెబుతున్నారు. తీర్పు వెలువడిన వెంటనే ఆయన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని.. ఆ వెంటనే ఆయన్ను కోర్టు బయట ఉంచిన స్కార్పియో కారు వద్దకు తీసుకెళ్లారన్నారు.
తీర్పు నేపథ్యంలో తన అనుచరులంతా ప్రశాంతంగా ఉండాలని.. ప్రత్యేక కెమేరాల ముందు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా అధికారులు గుర్మీత్ కు సూచించారట. తీర్పు నేపథ్యంలో సిర్సా నుంచి కోర్టు వద్దకు వచ్చిన వాహన శ్రేణులను వెనక్కి వెళ్లిపోవాలని చెప్పాలని కోరినట్లుగా తెలుస్తోంది.
సాధారణంగా పంచకుల సీబీఐ కోర్టులో విచారణ తర్వాత దోషులను అంబాలా సెంట్రల్ జైలుకు తీసుకెళతారు. అయితే.. గుర్మీత్ విషయంలో ఆయన్ను అభిమానించే వారి కారణంగా జైలు దగ్గర శాంతిభద్రతల సమస్య ఎదురయ్యే అవకాశం ఉందన్న అనుమానంతో పంచకుల కోర్టు నుంచి గుర్మీత్ కు హెలికాఫ్టర్ లో రోహ్ తక్ కు తీసుకెళ్లారు. రోహ్ తక్ ప్రాంతంలో డేరాకు పెద్దగా అనుచర వర్గం లేకపోవటంతో అధికారులు ఆయన్ను అక్కడకు తరలించాన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం దోషిగా నిరూపితమైన గుర్మీత్ కు ఈ కేసులో ఏం శిక్ష విధించాలన్న నిర్ణయాన్ని సోమవారం ప్రకటించనున్నారు. న్యాయవాద వర్గాల అంచనా ప్రకారం ఏడేళ్ల వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శిక్షను ఖరారు చేసే సమయంలో గుర్మీత్‌నుజైలుకు తీసుకురారని.. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా తీర్పు వివరాలు తెలిసేలా చేయనున్నట్లు తెలుస్తోంది.