ఢిల్లీ - హ‌ర్యానాలో మ‌ళ్లీ భూప్ర‌కంప‌నలు: భ‌యాందోళ‌న‌లో స్థానికులు

Update: 2020-06-08 16:17 GMT
మొన్న దేశంలోని ప‌లు ప్రాంతాల్లో భూప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. మ‌ళ్లీ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో సంభ‌వించాయి. వ‌రుస భూకంపాలు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌లో ప‌డేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ ప్రకంపనలతో ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా భ‌య‌ప‌డి బ‌య‌ట‌కు ప‌రుగులు పెట్టారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.1గా న‌మోదు కావ‌డంతో కొంత ప్ర‌మాదం త‌ప్పింది.

ఈ క్ర‌మంలో శాస్త్ర‌వేత్త‌లు, ప‌రిశోధ‌కులు ఈ భూ ప్ర‌కంప‌న‌ల‌పై అధ్య‌య‌నం చేశారు. గురుగ్రామ్‌కు స‌మీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఢిల్లీ ప‌క్క రాష్ట్రం హర్యానాలో కూడా భూప్రకంపనలు వ‌చ్చాయి. అయితే ఏయే ప్రాంతాల్లో వ‌చ్చాయోన‌ని అధికారులు వివ‌రాలు సేక‌రిస్తున్నారు. కొన్ని రోజులుగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ రీజియన్‌లో తరచూ భూకంపాలు, భ‌యోత్పాతాలు వ‌స్తుండ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న చెందుతున్నారు. ఢిల్లీలో ఇటీవ‌ల చోటుచేసుకున్న భూప్ర‌కంప‌నాల వివ‌రాలు..

ఏప్రిల్ ‌లో 12, 13
మేలో 10, 15, 29 తేదీల్లో
తాజాగా జూన్ 8
Tags:    

Similar News