అరిష్టమంట; మగోళ్లు బతుకమ్మ ఆడేదేంది..

Update: 2015-10-21 09:49 GMT
బతుకమ్మ పండుగను నభూతో నభవిష్యతి అన్నట్లుగా నిర్వహించటంలో తెలంగాణ సర్కారు సక్సెస్ అయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను భావోద్వేగంగా నిర్వహించటమే కాదు.. అన్ని వర్గాల్ని అందులో మమేకం చేయటంలో తెలంగాణ సర్కారు సక్సెస్ అయ్యింది. అయితే.. బతుకమ్మను ఘనంగా నిర్వహించి హ్యాపీగా ఉన్న సర్కారుకు.. కాంగ్రెస్ సీనియర్ నేత.. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఓవైపు రైతులు ఆత్మహత్యలతో కిందామీదా పడుతుంటే.. తెలంగాణ సర్కారుకు అదేమీ పట్టటం లేదని తీవ్రంగా మండిపడ్డారు. పండగలంటూ.. బతుకమ్మ కోసం రూ.100కోట్లు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో రైతాంగం సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతుంటే.. మరోవైపు కేసీఆర్ సర్కారు పండుగల పేరుతో భారీగా ఖర్చుచేస్తుందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ సర్కారు పుణ్యమా అని ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని చెప్పిన ఆయన.. మగవారు బతుకమ్మ ఆడటం అనేది ఉందడని.. అలా ఆడకూదన్నారు.

కానీ.. ఇదేమీ పట్టించుకోని కేసీఆర్ సర్కారు హయాంలో మగాళ్లు కూడా బతుకమ్మఆడుతూ అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. మగాళ్లు బతకమ్మ ఆడితే అరిష్టం అంటూ కొత్త పాయింట్ బయటకు తీసి వదిలారు గుత్తా. పండుగలకు కూడా ఆడ.. మగ అన్న తేడా ఉంటుందా? అయితే.. మగాళ్లు బతుకమ్మ ఆడితే తెలంగాణ రాష్ట్రానికి ఆరిష్టంగా ఆయన అభివర్ణించారు. మరి.. గుత్తా మాటలకు టీఆర్ఎస్ నేతలకు ఏం బదులిస్తారో..?
Tags:    

Similar News