మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ భవితవ్యం ఇరకాటంలో పడుతోంది. టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి టీఆర్ ఎస్ లో చేరేందుకు వీలైనంత ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే, అవేవీ వర్కవుట్ కాలేదు. దీంతో మోత్కుపల్లి తన చేరిక వ్యవహారాన్ని పెండింగ్ లో పెట్టేశారు. ఇలా గందరగోళం కొనసాగుతున్న సమయంలోనే హఠాత్తుగా ముదస్తు ఎన్నికలు వచ్చిపడటంతో ఆయన పరిస్థితి మరింత ఇరకాటంలో పడింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా బరిలో దిగాలని చూస్తున్న రాజయ్యను టీఆర్ ఎస్ టార్గెట్ చేస్తోంది.
ఆలేరు ప్రజలు తనను ఆదరించాలని, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిపించాలని మోత్కుపల్లి నర్సింహులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా టీఆర్ ఎస్ పార్టీ నేత - రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు - ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పరోక్షంగా మోత్కుపల్లిపై విమర్శలు గుప్పించారు. 25 ఏళ్లు ఏకధాటిగా ఆలేరు ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తులు.. ఈ రోజు గోదావరి జలాల పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కసారి గెలిపిస్తే గోదావరి జలాలు తెస్తానని కొందరు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని విమర్శించారు. ఇవే చివరి ఎన్నికలంటూ కల్లబొల్లి మాటలు చెప్తూ జనం ముందుకు వస్తున్నారు.. అలాంటి వారి జాగ్రత్తగా ఉండాలని గుత్తా హెచ్చరించారు. ఆలేరు నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావాలంటే కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి పనులు కొనసాగాలంటే టీఆర్ ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి. ఆలేరు నియోజకవర్గం అంటే కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ అని గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. కాగా, ఇటు అధికార పార్టీ దాడి, అటు ఏ పార్టీ మద్దతు లేని నేపథ్యంలో మోత్కుపల్లి భవితవ్యం ఏవైపు సాగనుందనే ఆసక్తి నెలకొంది.