వలస నేతలు..ఫైర్ బ్రాండ్ ను తొక్కేశారా!

Update: 2019-11-26 10:34 GMT
భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ గా ఉండిన నేత జీవీఎల్ నరసింహారావు. రాజ్యసభ సభ్యుడు అయిన దగ్గర నుంచి జీవీఎల్ ఒక రేంజ్ లో మాట్లాడుతూ వచ్చారు. టీవీ చానళ్ల చర్చా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడటంలో అయినా, ప్రెస్ మీట్లు పెట్టి దుమ్ముదులిపేయడంలో అయినా జీవీఎల్ తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు. అలా తనకు దక్కిన పదవికి న్యాయం చేస్తూ వచ్చారు.

మరోవైపు పార్టీ తరఫున ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ కూడా జీవీఎల్ వార్తల్లో నిలుస్తూ వచ్చే వాళ్లు. అయితే అదంతా గతం అన్నట్టుగా తయారు అయ్యింది పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ గా వెలిగిన జీవీఎల్ ఇప్పుడు కామ్ అయిపోయారు. పెద్దగా మాట్లాడటం లేదు. ముందుతో పోలిస్తే ఆయన వార్తల్లో కనిపించడం కూడా బాగా తగ్గిపోయింది!

దీనికంతటికీ కారణం ఏమిటి? అంటే.. వలస నేతలే అనే కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తు అయిపోవడంతో పలువురు నేతలు బీజేపీలోకి ఫిరాయించారు. వచ్చిన వాళ్లు మరీ కొత్త బిచ్చగాళ్లలా తయారయ్యారు. వీరు అంతా తమదే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు.

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పార్టీలో ఉన్న వారు కూడా అంత హడావుడి చేయరు. అంతలా ఫిరాయింపుదారులు రెచ్చిపోతూ ఉన్నారు. బీజేపీ అంటే తామే అన్నట్టుగా ఉంది వారి తీరు.

వారిలో కొందరు ఇది వరకూ  బీజేపీని తీవ్రంగా విమర్శించిన వారున్నారు. టీవీ చర్చా కార్యక్రమాల్లో వారు బీజేపీని తిట్టారు, మోడీని తిట్టారు. జీవీఎల్ తోనూ కస్సుబుస్సులాడారు చాలా సార్లు. అలాంటి వాళ్లంతా ఇప్పుడు బీజేపీలోకి చేరి హడావుడిచ ఏస్తూ ఉన్నారు.

అలాంటి వలస నేతలు వచ్చి తెగ మాట్లాడేస్తూ ఉంటే, ఇలాంటి సమయంలో తాము కూడా మాట్లాడితే అంతా ప్రహసనంగా మారుతుందని అనుకున్నారో ఏమో కానీ, ఈ బీజేపీ ఫైర్ బ్రాండ్ కామ్ అయిపోయారు. వెనుకొచ్చిన చెవుల్లా తయారైంది జీవీఎల్ పరిస్థితి పాపం! అని అంటున్నారు పరిశీలకులు.
Tags:    

Similar News