ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ... రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పెద్ద ఆశ్చర్యమేమీ కాదు గానీ... ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ ఈ మాటల తూటాలకు మరింత వాడీ వేడీ పెరుగుతుంది. ఈ మాటను నిజం చేసేలా... ఏపీలో అధికార పార్టీ నేతలు నిజంగా తూటాల్లాంటి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అధికార పార్టీ నేతలుగా సంయమనం పాటించాల్సి ఉన్నా... ఓడిపోతామన్న భయమో, ఇంకేదో తెలియదు గానీ... ఇప్పుడు టీడీపీ నేతల నోట నుంచి ఘాటు వ్యాఖ్యలు పరిపాటిగా మారాయని చెప్పక తప్పదు. అయితే టీడీపీ వాగ్బాణాలకు ధీటుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందిస్తున్నారు. అధికార పక్షంపైకి సవాళ్లు విసురుతున్నారు. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే నోటి దురుసు టీడీపీకి తనదైన శైలిలో సరైన కౌంటర్లు ఇవ్వడంలో మాత్రం బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాటే దేలారనే చెప్పాలి.
నాలుగేళ్ల పాటు తమతో కలిసి ప్రయాణం చేసిన టీడీపీ నేతలు... అప్పుడు తమ ప్రభుత్వ పనితీరును మెచ్చుకుని ఇప్పుడు మాత్రం విమర్శలు చేస్తున్నారంటూ తనదైన శైలి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. గతంలో తమతో టీడీపీ నేతలు ఎలా వ్యవహరించింది? ఇప్పుడు ఎలా వ్యవహరిస్తోంది? పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తున్న జీవీఎల్... ఇప్పుడు సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచారని చెప్పాలి. మొన్న ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిరసనగా ప్రజా సంఘాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని... ఆ బంద్ కు పూర్తి మద్దతు ప్రకటించిన చంద్రబాబు... ఏకంగా నల్ల రంగు చొక్కా వేసుకుని అసెంబ్లీకి వచ్చిన విషయం తెలిసిందే కదా. ఆ సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయలేదని చంద్రబాబు చెబుతూ ఉన్న సమయంలో అబ్జెక్షన్ అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లేవగా... చంద్రబాబు తనదైన శైలిలో విరుచుకుపడిపోయారు.
రక్తం మరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు... తనలోని ఉగ్ర రూపాన్ని ప్రదర్శించి బీజేపీ నేతలపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా చంద్రబాబు వైఖరిపై స్పందించేందుకు తాజాగా మీడియా ముందుకు వచ్చిన జీవీఎల్.. చంద్రబాబును అసెంబ్లీ రౌడీగా అభివర్ణించారు. చంద్రబాబు పిచ్చి పీక్ స్టేజికి చేరుకుందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జీవీఎల్... ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న చంద్రబాబు అసెంబ్లీ రౌడీలా ప్రవర్తిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా నాడు చంద్రబాబు సభలో ఊగిపోయిన తీరును తనదైన శైలిలో ఎండగట్టిన జీవీఎల్... ఆయనను అసెంబ్లీ రౌడీతో పోల్చి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు నిజంగానే సంచలనంగా మారిపోయింది.