జీవీఎల్ వార్నింగ్‌!...టీడీపీ స‌ర్కారు ప‌ని అంతే!

Update: 2019-02-09 08:13 GMT
ఏపీలో ఇప్పుడు రాజ‌కీయాలు ఇప్పుడు ప‌తాక స్థాయికి చేరాయ‌నే చెప్పాలి. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఎల్లుండి ఢిల్లీలో దీక్ష‌కు దిగ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన స‌న్నాహాల్లో పార్టీ శ్రేణులు పూర్తిగా నిమ‌గ్న‌మైపోయాయి.  ఈ క్ర‌మంలో ఉన్న‌ట్టుండి బీజేపీ... బాబు ఢిల్లీ దీక్ష‌కు ఒక రోజు ముందుగానే ఏపీలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌ర్య‌ట‌న‌ను ఖ‌రారు చేసింది. రేపు ఏపీ టూర్‌కు రానున్న మోదీ... గుంటూరులో నిర్వ‌హించనున్న బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు. ఈ సంద‌ర్భంగా ఏపీకి తాము ఏం చేశామ‌న్న విష‌యాన్ని ఆయ‌న చెప్ప‌నున్న‌ట్లుగా స‌మాచారం. అంతేకాకుండా త‌మ‌పై టీడీపీ చేస్తున్న‌వ‌న్నీ నిరాధార ఆరోప‌ణ‌లేన‌ని కూడా మోదీ చెప్ప‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మోదీ ప‌ర్య‌ట‌నను అడ్డుకుంటామంటూ టీడీపీ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు ఇప్ప‌డు నిజంగానే కాక పుట్టిస్తున్నాయి. ఈ ప్ర‌క‌ట‌న‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు ఎంట్రీ ఇచ్చిన బీజేపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవీఎల్ న‌రసింహారావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మోదీ ప‌ర్య‌ట‌నను అడ్డుకుంటామ‌ని టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తే... ఆ మ‌రుక్ష‌ణ‌మే ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కారుకు నూక‌లు చెల్లిన‌ట్టేన‌ని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న ఒక్క‌సారిగా పొలిటిక‌ల్ హీట్‌ ను తారా స్థాయికి చేర్చిందనే చెప్పాలి. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వంగా టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌ను ఎలా అడ్డుకుంటుందని లాజిక్ తీసిన జీవీఎల్‌... మోదీ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటామ‌ని టీడీపీ ప్ర‌భుత్వం గానీ, సీఎం చంద్ర‌బాబు గానీ చేయ‌మ‌నండి చూద్దామంటూ ఏకంగా స‌వాలే విసిరారు. ఇదే ప్ర‌క‌ట‌న వచ్చిన మ‌రుక్ష‌ణ‌మే ఏపీలో టీడీపీ స‌ర్కారు ఉండ‌ద‌ని కూడా జీవీఎల్  భారీ వార్నింగే ఇచ్చారు. అంతేకాకుండా ఇటీవ‌ల తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి - ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి జ‌రిగిన అవ‌మానం కంటే కూడా ఘోరాతిఘోరంగా చంద్ర‌బాబుకు ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని కూడా జీవీఎల్ హెచ్చరిక‌లు జారీ చేశారు.

మొత్తంగా ద‌మ్ముంటే... ప్ర‌ధాని ప‌ర్య‌ట‌నను అడ్డుకుంటామ‌ని బ‌హిరంగంగా ఒక్క మాట అనండి చూద్దాం అంటూ జీవీఎల్ విసిరిన స‌వాల్‌ను చూస్తుంటే... బాబు ఏమాత్రం రాంగ్ స్టెప్ వేసినా... టీడీపీ స‌ర్కారును కుప్ప‌కూల్చేందుకు కూడా కేంద్రం వెనుకాడ‌బోద‌న్న కోణంలో జీవీఎల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్పుడు జీవీఎల్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారిపోయాయి. ఇదిలా ఉంటే... జీవీఎల్ వ్యాఖ్య‌లు చెవిన‌ప‌డ్డాయో, ఏమో తెలియ‌దు గానీ... ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌పై ఎలా వ్వ‌వ‌హ‌రించాల‌న్న విష‌యంపై స‌చివాలయంలో మంత్రులు, పార్టీ కీల‌క నేత‌ల‌తో స‌మావేశ‌మైన చంద్ర‌బాబు... ఎలా ముందుకు సాగుదామంటూ చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవాల‌ని చెప్ప‌డానికి బ‌దులుగా... మోదీ ప‌ర్య‌ట‌న‌కు నిర‌స‌న‌గా ర్యాలీలు నిర్వ‌హించాల‌ని పార్టీ శ్రేణుల‌కు, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు ఇచ్చారు. ఈ పిలుపు మేర‌కు ఇప్ప‌టికే రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో టీడీపీతో పాటు వామ‌ప‌క్షాల‌కు చెందిన అనుబంధ సంఘాలు, ప‌లు ప్ర‌జా సంఘాలు కూడా మోదీ ప‌ర్య‌ట‌న‌ను నిర‌సిస్తూ ర్యాలీలు మొద‌లెట్టాయి. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?

Tags:    

Similar News