విడాకుల కోసం కోర్టుకు వెళితే.. అత్తారింటికి ఇల్లరికానికి వెళ్లమని తీర్పిచ్చింది
రోటీన్ కు భిన్నమైన తీర్పును ఇచ్చిన కోర్టు ఆదేశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మనస్పర్థల నేపథ్యంలో విడిగా ఉంటున్న భార్య భర్తల పంచాయితీ కోర్టుకు వెళ్లింది. ఈ సందర్భంగా కోర్టు ఇచ్చిన ఆదేశం షాకింగ్ గా మారటమే కాదు.. దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తోంది. చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ కోర్టు చెప్పిందేమిటో తెలుసా? భర్త గారిని అత్తారింటికి నెల పాటు వెళ్లాలని.. వారితో ఉండాలని.. ఇంటికి వచ్చిన అల్లుడ్ని బాగా చూసుకోవాలని.. ఆ తర్వాత విడిపోవటమా? కలిసి ఉండటమా? అన్నది తమతో చెప్పమన్న కోర్టు ఆదేశం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ తీర్పు ఇచ్చిన కోర్టు ఏది? ఇంతకూ దంపతుల మధ్య గొడవలకు కారణమేంది? అసలేమైందన్న విషయంలోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నగరానికి చెందిన గీతాకు.. మొరాదాకు చెందిన గణేశ్ కు పెళ్లైంది. వారి దాంపత్యానికి గుర్తుగా ఒక కొడుకు పుట్టాడు. కొంతకాలం బాగానే సాగిన వారి వైవాహిక జీవితంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అవి కాస్తా ఘర్షణలుగా మారాయి. ఈ నేపథ్యంలో భర్త తీరును తట్టుకోలేని గీతా.. భర్తను వదిలేసి దూరంగా వెళ్లిపోయింది. అయితే.. కొడుకును మాత్రం భర్త తన దగ్గర ఉంచేసుకున్నాడు. తిరిగి ఇచ్చేది లేదని.. తన దగ్గరే పెంచుకుంటాడని తేల్చేశాడు.
దీంతో.. గ్వాలియర్ హైకోర్టును ఆశ్రయించింది గీతా. కొడుకును తనకు ఇచ్చేయాలని ఆమె పిటిషన్ దాఖలు చేసింది. తాము వేర్వేరుగా ఉంటున్న విషయాన్ని చెప్పింది. దీంతో.. అసలు భార్యభర్తల మధ్య గొడవలకు కారణం ఏమిటన్న దానిపై ఫోకస్ చేసింది కోర్టు. దీనికి భార్య గీత వాదన ఏమంటే.. తనను మానసికంగా హింసించారని.. అత్తారింట్లో తాను వేధింపులకు గురైనట్లుగా పేర్కొంది. అందుకే.. తాను ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లుగా పేర్కొంది.
ఇదే కేసులో భర్త గణేశ్ తన వాదన వినిపిస్తూ.. తాను అత్తారింటికి వెళితే సరిగా చూసుకునేవారు కాదని.. వేధింపులకు గురయ్యేవాడినని అందుకే.. తమ మధ్య గొడవలైనట్లు పేర్కొన్నారు.ఇరువురి వాదనలు విన్న గ్వాలియర్ హైకోర్టు విచిత్రమైన తీర్పును ఇచ్చింది. ఒక నెల రోజుల పాటు భర్తగణేశ్ ను భార్య గీతా వాళ్ల ఇంటికి (అత్తారింటికి) వెళ్లి ఉండాలని చెప్పింది. అదే సమయంలో అత్తారింటి వారికి కూడా అల్లుడ్ని చక్కగా చూసుకోవాలని ఆదేశించింది. నెల తర్వాత వారి మధ్య మనస్పర్థలు తీరిపోయి.. కలిసి ఉంటారని ఆశిస్తున్నట్లు చెప్పింది. అప్పటికి లెక్క తేలకపోతే.. నెల తర్వాత తమ వద్దకు రావాలని.. అప్పుడేం చేయాలో ఆలోచిస్తామని పేర్కొంది. ఈ తీర్పు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.