అన్ లాక్ 3.0.. థియేటర్లు - జిమ్ లకు గ్రీన్ సిగ్నల్?

Update: 2020-07-26 15:03 GMT
దేశంలో జులై 31తో అన్ లాక్ 2.0 ముగియబోతోంది. దీంతో అన్ లాక్ 3.0పై కేంద్రంలోని మోడీ సర్కార్ మార్గదర్శకాల కోసం సిద్ధమవుతోంది. ఆగస్టు 1 నుంచి అన్ లాక్ 3.0లో లాక్ డౌన్ కు మరిన్ని సడలింపులు ఇస్తారని భావిస్తున్నారు.

అయితే అందరూ ఎదురుచూస్తున్న పాఠశాలలు, కాలేజీలు సహా విద్యాసంస్థలు, మెట్రో సర్వీసులకు మాత్రం ఈసారి కూడా అనుమతి లభించడం కష్టమంటున్నారు.

ఇక ఆగస్ట్ 1 నుంచి సినిమా హాళ్లు - జిమ్ లకు కేంద్రం అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భౌతిక దూరం నిబంధనలతో సినిమా హాళ్లను తిరిగి తెరిచేందుకు వెసులుబాటు కల్పిస్తారని అధికార వర్గాలు అంటున్నాయి.

ఇక 50 శాతం సీటింగ్ తో సినిమా థియేటర్లు తెరిపించేలా సమాచార ప్రసార శాఖ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు హాళ్ల యజమానులతో కేంద్ర సమాచార శాఖ చర్చిస్తోంది. పాఠశాలలు తెరవడం మాత్రం ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చేశారు.


Tags:    

Similar News