హెచ్1బీ ఎఫెక్ట్: 60 రోజుల్లో జాబ్ లేకుంటే అమెరికా వదలాల్సిందే?

Update: 2022-11-10 16:30 GMT
భారతీయ ఉద్యోగులకు హెచ్1బీ వీసా గండం ఉంది. ట్విట్టర్, ఫేస్ బుక్ సహా అన్ని కంపెనీలు ఉద్యోగులను పెద్ద ఎత్తున తీసివేస్తుండడంతో  ఉద్యోగం కోల్పోయిన భారతీయులు కొత్త జాబ్ వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకవేళ హెచ్1 బీ టెకీలు రెండు నెలలు అంటే 60 రోజుల్లో కొత్త జాబ్ సంపాదించుకోవాలి. లేదంటే అమెరికా వదిలి స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలనే నిబంధన ఉంది.

అమెరికాలో కంపెనీల తొలగింపుల్లో భారతీయులు కూడా పెద్ద ఎత్తున జాబ్ లు కోల్పోయారు. 200 మందిలో 90శాతం మంది ఉద్యోగులు జాబ్ కోల్పోయారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో మంది హెచ్1బీ వీసా ఉన్న వారు ట్విటర్, లింక్ డిన్ లో జాబ్ చేస్తున్నారు.  అయితే వారికి 60 రోజుల గడువు మాత్రమే ఉంది. హెచ్1బీ వీసాలు అమెరికా కంపెనీలు విదేశీయులకు  కొంతకాలం పనిచేయడానికి అనుమతి ఇస్తారు. మూడు నుంచి ఆరేళ్ల వరకూ  అనుమతి ఉంటుంది. ట్విటర్ ఉద్యోగుల్లో చాలా మంది హెచ్1 బీ వీసా కలిగిన వారు ఉన్నారు.  ఒకవేళ టర్మినేషన్ లెటర్ (జాబ్ కోల్పోయిన) అందుకున్న తర్వాత 2 నెలల్లో  ఉద్యోగం పొందాల్సి ఉంటుంది.  లేదంటే వారు అమెరికా విడిచి వెళ్లిపోవాల్సిందే. దీంతో వీళ్లంతా అమెరికాలో ఉండాలంటే కొత్త జాబ్ పొందాల్సి ఉంటుంది.

యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఏజెన్సీ ఈ సంవత్సరం హెచ్1బీ వీసా కోసం 483,927 రిజిస్ట్రేషన్‌లను పొందింది. మొత్తం 1,27,000 దరఖాస్తులు పరిశీలించారు. మొదటి రౌండ్‌లో 85,000 తప్పనిసరి పరిమితిని చేరుకోవడానికి ఎంపిక చేయబడ్డారు. వీటిలో 20,000 అధునాతన డిగ్రీ విభాగంలోకి వస్తాయి. కోటాను మించి దరఖాస్తులు ఇప్పటికే చేరుకున్నందున 2023 సంవత్సరానికి రెండవ రౌండ్ ఎంపికలు ఉండకపోవచ్చని యూఎస్ ఇమ్మిగ్రేషన్ బాంబు పేల్చింది.

అమెరికాలో హెచ్1బీ వీసాదారుల భార్యలు/భర్తలతోపాటు 21లోపు పిల్లలకు అమెరికా పౌరసత్వం, వలస సేవలసంస్థ (యూఎన్సీఐఎస్) హెచ్4 వీసాలు జారీ చేస్తుంటారు. 2015లో అప్పటి అధ్యక్షుడు ఒబామా హెచ్4 వీసాలకు అనుమతిచ్చారు.

డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాన వలస విధానంపై కఠిన ఆంక్షలు పెట్టారు. హెచ్4 వీసాదారులకు పని అనుమతులు రద్దు చేశారు. దీంతో అమెరికాలో నివాసం ఉంటున్న వలసదారుల భాగస్వాములకు ఉద్యోగం కరువై వీసాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News