హెచ్1బీ క్రేజ్: రెండో రౌండ్ లాటరీ లేదు.. కోటా క్లోజ్

Update: 2022-08-25 07:32 GMT
యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఏజెన్సీ ఈ సంవత్సరం హెచ్1బీ వీసా కోసం 483,927 రిజిస్ట్రేషన్‌లను పొందింది. మొత్తం 1,27,000 దరఖాస్తులు పరిశీలించారు. మొదటి రౌండ్‌లో 85,000 తప్పనిసరి పరిమితిని చేరుకోవడానికి ఎంపిక చేయబడ్డారు.

వీటిలో 20,000 అధునాతన డిగ్రీ విభాగంలోకి వస్తాయి. కోటాను మించి దరఖాస్తులు ఇప్పటికే చేరుకున్నందున 2023 సంవత్సరానికి రెండవ రౌండ్ ఎంపికలు ఉండకపోవచ్చని యూఎస్ ఇమ్మిగ్రేషన్ బాంబు పేల్చింది.

కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది. వీటితోపాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్  విభాగాల్లో అమెరికా యూనివర్సిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20 వేల వీసాలు ఇస్తారు. అంటే మొత్తం 85వేల హెచ్1బీ వీసాలు అన్నమాట..

ఆన్‌లైన్ దరఖాస్తుదారులు ఎక్కువైనట్టు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.  గత సంవత్సరం, 85,000 గ్రీన్ కార్డ్ కోసం 308,613 దరఖాస్తులు వచ్చాయి. మూడు రౌండ్ల ఎంపికలు జరిగాయి. ఈ సంవత్సరం మొత్తం 483,927 నుండి 1,27,000 దరఖాస్తులు ఇప్పటికే ఎంపిక చేయబడినందున రెండవ రౌండ్ కూడా ఉండకపోవచ్చని చెబుతున్నారు.

కాలం చెల్లిన హెచ్1బీ వీసా విధానం కారణంగా అమెరికా నుంచి ప్రతిభావంతమైన భారతీయులు కెనడా వంటి దేశాల వైపు ఆకర్షితులవుతున్నట్లు ఇమ్మిగ్రేషన్ విధాన నిపుణులు గత ఏడాది అమెరికా చట్టసభ సభ్యులకు తెలిపారు.

ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు, శాశ్వాత నివాస వీసా జారీ చేయబడడానికి అమల్లో ఉన్న కంట్రీ క్యాప్ విధానం వల్ల భారతీయుల ప్రతిభావంతులు అమెరికా నుంచి కెనడాకు తరలి వెళఉతున్నారు. ఇది నిరోధించడానికి అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానం మారాలని అమెరికాన్ పాలసీ డైరెక్టర్లు కోరుతున్నారు.
Tags:    

Similar News