అమెరికా చదువులంటే ఆ క్రేజే వేరు. సొంత ప్రాంతంలో ఉండి చదివే చదువు పనికిరాదని పోలొమని అమెరికా చెక్కేసి ఏ చిన్నచిన్న విశ్వవిద్యాలయాల్లో చదివేసినా అక్కడ ఉన్న కంపెనీల్లో ఏ పని చేసినా డాలర్లలో సంపాదించేసుకోవచ్చు. ఆ డాలర్లను రూపాయిలుగా మారిస్తే రూ.లక్షలు అవుతాయనే ఉద్దేశంలో మన యువత ఉన్నారు. యువతతో పాటు వారి కుటుంబసభ్యుల కూడా అలాంటి ధోరణిలో ఉన్నారు. అలా అమెరికా వెళ్లిన యువత, ఉద్యోగులు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కలిసొస్తే అక్కడే ఉండొచ్చు... లేదంటే తట్టాబుట్ట సర్దేసుకుని స్వదేశం బాట పట్టాల్సిన సమయం ఆసన్నమవుతోంది.
ఉన్నత విద్య పూర్తి చేసి, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) అర్హతతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులు దాదాపు 68 వేల మంది ఉన్నారు. వీరంతా ప్రస్తుతం తీవ్ర ఆందోళన లో ఉన్నారు. మూడేళ్ల కాలవ్యవధి కోసం ఇచ్చే ఓపీటీ ఈ ఏడాదితో పూర్తవుతోంది. ఇప్పటికే రెండుసార్లు హెచ్1బీ వీసా అవకాశం కోల్పోయిన ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు 2020 ఏప్రిల్ చివరి అవకాశం. ఈ చివరి అవకాశంలో మాత్రం వీసా రాకపోతే స్వదేశానికి తిరిగి వెళ్లడం లేదా మళ్లీ విశ్వవిద్యాలయంలో చేరి పీహెచ్‌డీ, లేదా ఎంఎస్‌లో మరో కోర్సు చేయాల్సిందే. అయితే వాటికి భారీ ఖర్చుతో కూడుకున్నదే. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికులు తిరిగి ఎంఎస్‌లో చేరడానికి సుముఖంగా లేరు. ఒకవేళ వీసా రాకపోతే భారత్ తిరిగి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు.
2015-16లో అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన వారు ఇప్పుడు వీసా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కంప్యూటర్ రంగంలో పని చేసేవారికి అమెరికా ఏటా 85 వేల మందికి హెచ్1 బీ వీసాలు మంజూరు చేస్తోంది. కానీ భారత్ నుంచి ఉన్నత విద్యకు వెళ్లి ఆపైన హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య 2016లోనే లక్ష దాటింది. ఈ ఏడాది భారతీయుల సంఖ్య లక్షన్నర దాటుతుందని ఆ దేశం భావిస్తోంది. దీంతో వచ్చే రెండేళ్లలో హెచ్ 1బీ వీసా కోసం దరఖాస్తు చేసే భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల సంఖ్య 2 లక్షలు దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 85 వేల హెచ్ 1బీ వీసాల్లో 65 నుంచి 70 వేల మందికి మాత్రమే వీసాలు దక్కే అవకాశం ఉంది. అంటే మిగతా లక్షన్నర మందికి నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది.
హెచ్ 1బీ కోసం పెళ్లిళ్లు..
అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కొత్త పరిష్కారం కనుగొన్నారు. హెచ్ 1బీ వీసా కలిగి ఉన్న వారిని జీవిత భాగస్వాములను చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో హెచ్1బీ వీసా ఉన్న వారి సంబంధాలు చూడాలని తమ కుటుంబసభ్యులను కోరుతున్నారు. హెచ్ 1బీ వీసా ఉండి (గ్రీన్‌కార్డు కోసం వెయిటింగ్‌లో ఉంటే) జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది. గ్రీన్‌కార్డు కోసం వెయిటింగ్‌లో లేని హెచ్ 1బీ వీసా అబ్బాయి లేదా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సంబంధాల వెతుకులాట లో ఉన్నారు. మ్యారేజ్ బ్యూరోలను ఆశ్రయిస్తున్నారు.
అయితే వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఓపీటీ గడువు దాటుతున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాదాపు 20 నుంచి 24 వేల మంది ఇంజనీర్లు ఉంటారని తెలుస్తోంది. నిర్ణీత గడువులోపు వీరికి వీసా రాకపోతే స్వదేశానికి వెళ్లి మళ్లీ హెచ్ 1బీ దరఖాస్తు చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఆర్థికంగా స్థిరంగా ఉన్న భారతీయ టెకీలు అక్కడే ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇవన్నీ కుదరకపోతే భారత్ కు వచ్చి ఆ అమెరికాతో గోస పడలేక ఇతర దేశాలు వీసా నిబంధనలు సరళంగా ఉన్న లండన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.