అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తీసుకుంటున్న పలు కఠిన నిర్ణయాలు, అమెరికాలో నెలకొన్న ఇబ్బందికర పరిణామాల నేపథ్యంలో...అగ్రరాజ్యంపై గతంలో వలే భారతీయులకు మోజు లేదు అనుకునే అభిప్రాయాన్ని దూరం చేసుకోవాల్సిందే! ఎందుకంటే, నిపుణులు అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇచ్చే హెచ్1బీ వీసాల దరఖాస్తులకు ఊహించని డిమాండ్ వచ్చి పడింది. కేవలం 5 రోజుల్లోనే ఏకంగా మొత్తం హెచ్1బీ వీసా కోటాకు సరిపడిన దరఖాస్తులు వచ్చిపడ్డాయట. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా వీసాల జారీ అధికారిక విభాగమైన యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ ఆండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) స్పష్టం చేసింది.
యూఎస్‌సీఐఎస్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం 65,000 వీసాల పరిధి కేవలం ఐదు రోజుల్లోనే సరిపడా దరఖాస్తులు వచ్చాయట. దీంతో పాటుగా యూఎస్ అడ్వాన్స్‌డ్ డిగ్రీ ఎగ్జెంప్షన్ కింద మరో 20,000 వేల దరఖాస్తులు చేరుకున్నాయట. ఈ ప్రకటన ద్వారా అమెరికా అంటే ఇప్పటికీ ఎంత క్రేజ్ ఉందో యూఎస్‌సీఐఎస్ చెప్పకనే చెప్పినట్లయింది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినప్పటికీ కూడా తమ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను నిలిపివేయబోమని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది. గత సోమవారం నుంచి హెచ్1బీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.
మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత `బై అమెరికా, హైర్ అమెరికా` అనే కీలక నినాదంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో వీసాల సంఖ్య తగ్గిస్తారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ యూఎస్‌సీఐఎస్ దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టే నాటికి కూడా గతంలో ఉన్న 85,000 సంఖ్యనే కొనసాగింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/