నిపుణులైన భారతీయులు అమెరికాలో కొలువు చేసేందుకు ఉద్దేశించిన హెచ్1బీ వీసాలపై అమెరికాలోని కొందరు చేసిన ఆరోపణలు తప్పని తేలింది. ఈ వీసా వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు గండిపడిందనే ప్రచారంలో వాస్తవం లేదని పైగా అగ్రరాజ్యానికే మేలు జరిగిందిన సాక్షాత్తు అమెరికాలో జరిగిన అధ్యయనం తేల్చి చెప్పింది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై హెచ్1బీ వీసాల ప్రభావంపై మిచిగన్, కాలిఫోర్నియా-సాన్ డియాగో యూనివర్సిటీల పరిశోధకులు జాన్ బౌండ్ - నికొలస్ మొరేల్స్ - గౌరవ్ ఖన్నా తదితరుల బృందం ఈ అధ్యయనం జరిపింది. భారతీయ ఐటీయన్లు ఎంతో ఇష్టపడే హెచ్1బీ ఉద్యోగ వీసాలు వినూత్న ఆవిష్కరణలపై సానుకూల ప్రభావం చూపాయని, మొత్తమ్మీద అమెరికన్ల సంక్షేమం పెరిగిందని ఓ తాజా సర్వేలో తేలింది. ఈ వీసా నిబంధనల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం మార్పులు తెస్తారోనని హడలిపోతున్న దశలో ఇలాంటి ఫలితాలు రావడం ఆసక్తి కలిగిస్తోంది.
1990లలో ఐటీ బూమ్ లో అమెరికాకు వచ్చిన ప్రతిభావంతులైన విదేశీ కంప్యూటర్ నిపుణుల వినూత్న ఆవిష్కరణలకు కారణమై అమెరికా ప్రజల సంక్షేమంపై సకారాత్మక ప్రభావం చూపారని మిషిగాన్ - కాలిపోర్నియా-సాన్ డీగో యూనివర్సిటీల పరిశోధకుల సర్వేలో వెల్లడైంది. ఐటీ కంపెనీలకు సదరు భారతీయ ఐటీ నిపుణుల వల్ల ఇబ్బడి ముబ్బడిగా లాభాలు కూడా వచ్చాయని ఈ సర్వేలో స్పష్టమైంది. కాగా, అమెరికా ఐటీయన్ల ఉద్యోగావకాశాల తరుగుదల 6.1 నుంచి 10.8 శాతం ఉంది. అమెరికా నిపుణుల వేతనాలు తగ్గాయని అధ్యయనం వెల్లడించింది. మరోవైపు హెచ్1బీ వీసాను దుర్వినియోగం చేసి అమెరికా కార్మికులకు అన్యాయం చేయొద్దని ఇటీవలే ట్రంప్ సర్కారు కంపెనీలను గట్టిగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారతీయ ఐటీ నిపుణుల్లో కలవరం మొదలైంది. అయితే తాజా సర్వే ప్రభుత్వం ఆలోచన మారేందుకు పరిగణనలోకి తీసుకోదగిన అంశంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/