హాకర్స్ అటాక్: టాటా సన్స్ బ్యాంక్ ఖాతాకే టోకరా

Update: 2020-03-06 08:06 GMT
దేశంలో పెద్ద కంపెనీల్లో టాటా సన్స్ ఒకటి. రిలియన్స్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు టాటా కంపెనీల సొంతం. అలాంటి టాటా సన్స్ కంపెనీ బ్యాంక్ ఖాతాలకే ఏకంగా ఎసరు పెట్టారు హ్యాకర్లు. బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసి రూ.200 కోట్లు కాజేద్దామని స్కెచ్ గీశారు. అయితే ఈ వ్యూహాన్ని ముందే పసిగట్టిన పోలీసులు ఏడుగురు వ్యక్తుల ముఠాను అరెస్ట్ చేశారు.

ఏడుగురు వ్యక్తుల ముఠా ముందుగా టాటా సన్స్ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసి అందులో ఉన్న 200 కోట్లను కొల్లగొట్టాలని స్కెచ్ గీశారు. ఇందుకోసం వారు ముందుగా ఇండస్ ఇండ్ బ్యాంకులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ద్వారా ఖాతా వివరాలను తెలుసుకున్నారు. అయితే వీరి ప్రయత్నం బ్యాంకు పసిగట్టి అడ్డుకుంది. ఈ మేరకు తమ భద్రతా విభాగాలు హ్యాకింగ్ ను అడ్డుకున్నాయని ఇండస్ ఇండ్ బ్యాంక్ తెలిపింది. సహకరించిన బ్యాంక్ సిబ్బందిని తొలగిస్తామని చెప్పింది.

ఈ హ్యాకింగ్ కు ప్రయత్నించిన కేసులో మొత్తం ఏడుగురిని గుర్తించారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు.


Tags:    

Similar News