టీటీడీ..ఉద్యోగి అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో ర‌చ్చ‌

Update: 2018-04-23 13:34 GMT
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అనూహ్య వివాదాల‌తో ఇప్ప‌టికే వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. సుదీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న టీటీడీ బోర్డుకు ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా...అందులోని నియ‌మ‌కాల‌పై ర‌చ్చ ర‌చ్చ‌ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. చైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ క్రైస్త‌వుడ‌ని ఏకంగా స్వామీజీలే ఆరోపించ‌డం...దాన్ని ఆయ‌న ఖండించ‌డం వ‌గైరా క‌ల‌క‌లం సృష్టించాయి. ఈ వివాదానికి తోడుగా ఎమ్మెల్యే అనిత క్రైస్తవురాలనే వివాదం ఆమె రాజీనామా చేయ‌డం వంటివి వెంక‌న్న భ‌క్తుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేశాయి. దీనికి కొన‌సాగింపుగా తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వాహన బేరర్‌గా పనిచేస్తున్న కుమార్ పూటుగా మద్యం సేవించి అర్ధనగ్నంగా తిరుగుతూ రోడ్లపై వీరంగం సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసిన ఉదంతం మ‌రోమారు బాలాజీ భ‌క్తుల‌ను క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది.

మ‌తిత‌ప్పే రీతిలో తాగిన  టీటీడీ ఉద్యోగి కుమార్ ఈ క్ర‌మంలో ర‌చ్చ ర‌చ్చ సృష్టించాడు. ఆదివారం రాత్రి అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ, నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాలను ఎత్తిపడేసే యత్నం చేశాడు. మ‌ద్యం మ‌త్తులో తూలుతూ దుకాణాల్లోని కూరగాయలు - వస్తువులను రోడ్డుపైకి విసిరేసి ర‌చ్చ ర‌చ్చ చేశాడు. ఇంత‌టితో ఆగ‌కుండా అటుగా వెళ్లే వాహనదారులపై దాడికి యత్నించాడు. ఈ ఉదంతాన్ని గ‌మ‌నించిన‌ అడ్డం వచ్చిన కానిస్టేబుల్‌ పైనా దౌర్జన్యం చేశాడు. టీటీడీ ఉద్యోగి నిర్వాకాన్ని కొంద‌రు బంధించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో అది వైర‌ల్ అయింది.

దీంతో ఈ వ్య‌వ‌హారం టీటీడీ ఉన్న‌త‌వ‌ర్గాల‌కు కూడా చేరింది. వారు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో కుమార్‌ ను వెతికిప‌ట్టుకొని ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, కుమార్‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News