ఎయిరిండియా ఫ్లైట్ లో తేడా చేస్తే బేడీలేనట

Update: 2017-01-08 09:45 GMT
ఎయిరిండియా సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇటీవల కాలంలోచోటు చేసుకుంటున్న పరిణామాలతో ఊహించని రీతిలో నిర్ణయాన్ని తీసుకుంది. ప్రయాణికులు కొందరు తమ ప్రయాణ సమయంలో వ్యవహరిస్తున్న తీరుపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రయాణికులకు భద్రతే కీలకమని చెబుతూనే తీసుకున్న ఈ నిర్ణయం ఏమిటంటే.. విమాన ప్రయాణంలో ఎక్కువ చేసే వారికి ప్లాస్టిక్ బేడీలు వేసేస్తారు.

ఇటీవల కాలంలో ఎయిరిండియా సిబ్బందిపై వేధింపులు చోటు చేసుకోవటం.. కొందరు ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్ ల పట్ల అనుచితంగా.. కొన్నిసార్లు వేధించే తీరులో వ్యవహరిస్తున్నారు. దీంతో.. మిగిలిన ప్రయాణికులభద్రత మేరకు ఇలాంటి ప్రయాణికుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎయిరిండియా నిర్ణయించింది. ఇందులో భాగంగా వేధింపులకు దిగే ప్రయాణికులకు సంకెళ్లు వేయాలని డిసైడ్ అయ్యింది.

వాస్తవానికి ఇలాంటి విధానాల్నికొన్ని అంతర్జాతీయ విమానాల్లో మాత్రమే అనుమతి ఉంది. కానీ.. ఇక మీదట అందుకు భిన్నంగా జాతీయ.. అంతర్జాతీయ విమానాల్లో కూడా ప్లాస్టిక్ సంకెళ్లతో ప్రయాణికుల్ని బంధించే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు తన దురుసు ప్రవర్తనతో సిబ్బందిని.. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన సమయాల్లో.. వారిని నియంత్రించేందుకు ఈ సంకెళ్లు వేయటం జరుగుతుందని.. విమానం గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత అదికారులకు అప్పగించనున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రయాణికుల నుంచి సిబ్బందికి పెరిగి లైంగిక దాడుల నేపథ్యంలో ఎయిరిండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News