చెన్నైకి మరో షాక్: రైనా తర్వాత హర్భజన్ ఔట్

Update: 2020-09-04 13:30 GMT
కరోనాతో దేశం దాటి యూఏఈలో జరుపుకుంటున్న ఐపీఎల్ కు ఈ ఏడాది కలిసిరావడం లేదు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ సురేష్ రైనా ఇప్పటికే వైదొలగగా.. తాజాగా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా టోర్నీ నుంచి వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించాడు. తన నిర్ణయాన్ని జట్టు యాజమాన్యానికి తెలియజేశాడు.

సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకానుండగా.. ఆగస్టు 21న యూఏఈకి చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉంది. ఆ క్వారంటైన్ గడువు శుక్రవారంతో ముగియాల్సి ఉండగా.. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్‌ దీపక్ చాహర్‌తో పాటు 10 మంది టీమ్ స్టాఫ్‌కి కరోనా పాజిటివ్‌గా శుక్రవారం తేలింది.

చెన్నై సూపర్ కింగ్స్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా అనూహ్యంగా తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి రైనా తప్పుకున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు హర్భజన్ కూడా తప్పుకోవడంతో ఆ జట్టు ఆటతీరుపై గణనీయమైన ప్రభావం పడనుంది. ఇద్దరూ మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లు కావడంతో చెన్నై ఎలా ముందుకెళ్తున్నది వేచిచూడాలి.
Tags:    

Similar News