సాధారణంగా సెలబ్రిటీలు తమ దారిన తాము అన్నట్లు ఉంటారు. అత్యున్నత పదవుల్లో ఉండే వారితో పరిమిత మోతాదులో మాత్రమే సంబంధాలు ఉండే పరిస్థితి. కానీ.. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది.
ప్రభుత్వ కార్యక్రమాల్లో సెలబ్రిటీలను తెలివిగా భాగస్వామ్యం చేయటం మోడీకే చెల్లింది. ఒక ప్రభుత్వం చేపట్టిన పథకాలకు అవుట్ అండ్ అవుట్ గా బయటకు వచ్చేసి మరీ దానిలో భాగస్వామ్యం కావటం గతంలో పెద్దగా లేదు. దీనికి భిన్నంగా మోడీ ఆ దూరాన్ని తగ్గించేశారు. తాను చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఏ సెలబ్రిటీ నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు.
ఇలా ప్రముఖుల్ని ప్రభుత్వ పథకాల్లో మమేకం అయ్యేలా చేయటం మోడీకి మాత్రమే చెల్లుతుందేమో. ఇక్కడో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించాలి. గతంలో ప్రధాని పదవిలో ఉన్న నేత వద్దకు వెళ్లి.. పర్సనల్ ఇన్విటేషన్లు చాలా తక్కువగా ఇచ్చేవారు. పార్టీతో భాగస్వామ్యం ఉండే వారు కొద్దిమంది మాత్రమే వెళ్లే వీలుండేది. మోడీ పుణ్యమా అని ఆ హద్దులు చెరిగిపోయిన పరిస్థితి.
ఆ మధ్య మంచు మనోజ్ పెళ్లి కి ఆహ్వానించేందుకు ప్రధాని మోడీ వద్దకు మోహన్ బాబు.. మంచు లక్ష్మి వెళ్లటం తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా తన కుమారుడి పెళ్లికి పిలవటానికి మోడీని కలవటం.. ఈ సందర్భంగా తండ్రి వెంట వెళ్లిన సోనాక్షి సిన్హా.. మోడీని కలవటంపై విపరతంగా ఎక్సైట్ కావటం తెలిసిందే.
తాజాగా మరో సెలబ్రిటీ మోడీని కలిశారు. అయితే.. మిగిలిన వారి కంటే బిన్నంగా తన పెళ్లికి రావాలని ఆయనే స్వయంగా కోరారు. భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ ఈ నెల 29న జలంధర్ లో సినీనటి గీతా బస్రాను పెళ్లి చేసుకోవటం తెలిసిందే. ఈ వేడుకకు రావాలంటూ ప్రధానమంత్రి మోడీని స్వయంగా కలిసి ఆహ్వానించారు. 29న జలంధర్ లో వివాహ వేడుక.. నవంబరు 1న ఢిల్లోలోని ఒక ప్రముఖ హోటల్ లో రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి.. మోడీ ఏ కార్యక్రమానికి వెళుతున్నారు? ఏది ఏమైనా గతంలోని ప్రధానమంత్రుల కంటే భిన్నంగా మోడీకి వస్తున్న పెళ్లి ఇన్విటేషన్లు కాస్త ఎక్కువేనని చెప్పాలి.