కాఫీ విత్ కరణ్ షో లో ఆడవారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన హార్ధిక్ పాండ్యా మరియు రాహుల్ లను బీసీసీఐ నిషేదించిన విషయం తెల్సిందే. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ మూడవ వన్డేతో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇచ్చాడు. అనుచిత వ్యాఖ్యల వల్ల కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్ నుండి తొలగించబడిన హార్థిక్ పాండ్యా న్యూజిలాండ్ తో జరిగిన మూడవ వన్డేలో మంచి ఆట తీరును కనబర్చి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు.
అయిదు వన్డేల సిరీస్ ను టీం ఇండియా మరో రెండు వన్డేలు ఉండగానే సొంతం చేసుకుంది. మూడవ వన్డేలో హార్ధిక్ పాండ్యా పట్టిన క్యాచ్ మ్యాచ్ కే హైలైట్ గా చెప్పుకోవచ్చు. 17వ ఓవర్ లో చహల్ వేసిన తొలి బంతిని కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ముందుకు వచ్చి భారీ షాట్ కు ప్రయత్నించాడు. కాని అద్బుతమైన డైవ్ తో హార్ధిక్ పాండ్యా మెరుపు వేగంగా క్యాచ్ పట్టుకున్నాడు. విలియమ్సన్ 28 పరుగులు చేసి కుదురుకున్నాడనుకుంటున్న తరుణంలో పాండ్యా క్యాచ్ తో వెనుదిరిగాడు. ఇక వెంట వెంటనే రెండు కీలకమైన వికెట్లను కూడా పాండ్యా తీశాడు. పాండ్యా తనపై వచ్చిన విమర్శలకు ఇలా సమాధానం ఇచ్చాడు. పాండ్యా, రాహుల్ ల వివాదం ప్రస్తుతానికి సైలెంట్ అయినట్లుగానే అనిపిస్తోంది.