గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా ఎదురు దెబ్బతగిలింది. పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపిస్తున్న హార్దిక్ పటేల్.. పార్టీకి రాజీనామా చేశారు. పటేల్ సామాజిక వర్గానికి చెందిన హార్దిక్ పార్టీని వీడటం కాంగ్రెస్కు నష్టమే. హార్దిక్ కొంతకాలంగా పార్టీపై గుర్రుగా ఉన్నారు. తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని బహిరంగం గానే విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేశారు. అయితే హార్దిక్ ఏ పార్టీలో చేరతారనే విషయం పై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే.. బీజేపీలో చేరతారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కు వచ్చే నవంబరు-డిసెంబరు చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీకి గండి కొట్టి.. అధికార పగ్గాలు చేపట్టాలని.. కాంగ్రెస్ నిర్ణ యించుకుంది. కనీసం అధికారంలోకి రాకపోయినా.. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేలా వ్యవహరించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఇదే విషయాన్ని బీజేపీ నేతలు సైతం పసిగట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఇక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. పర్యటించి.. నేతలకు అప్పుడే దిశానిర్దేశం చేశారు.
ఇలాంటి సమయంలో కాంగ్రెస్ మరింత పుంజుకోవాల్సిన అవసరం ఉందని నాయకులు భావిస్తున్నారు. దీనిపై ప్రత్యేకంగా కాంగ్రెస్ కీలకనేత.. ఎంపీ.. రాహుల్ గాంధీ కూడా దృష్టి పెట్టారు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా హార్డిక్ పార్టీని వీడడం కాంగ్రెస్‌ను సంకటంలో పడింది. కాగా, చింతన్ శిబిరం నడుస్తోన్న వేళే సీనియర్ నేత, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జాఖఢ్ పార్టీని వీడారు. ఇప్పుడు ఆ జాబితాలో హార్దిక్ చేరారు.
హార్ధిక్ ఏమన్నారంటే..'కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేసేందుకు ఎంతో ధైర్యాన్ని కూటగట్టుకుంటున్నా ను. నా నిర్ణయాన్ని నా సహచరులు, గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని విశ్వసిస్తున్నాను. ఈ నిర్ణయంతో భవిష్యత్తులో నేను గుజరాత్ అభివృద్ధి కోసం పనిచేయగలనని నమ్ముతున్నాను' అంటూ హార్దిక్ తన రాజీనామాను ట్విటర్ వేదికగా ప్రకటించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈ లేఖను పంపారు.
గుజరాత్‌పై రాహుల్‌కు మనసులేదు!సోనియాకు రాసిన సుదీర్ఘ లేఖలో.. 'భారత్‌లో క్లిష్ట సమయాల్లో అవసరం ఉన్నప్పుడు మన నేత విదేశాల్లో ఉన్నారు'అంటూ రాహుల్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. అలాగే రాహుల్ గుజరాత్ పర్యటనలో భాగం గా హార్దిక్ ఆయనతో సమావేశం కాలేకపోయారు. 'నేను అగ్రనేతలను కలిసినప్పుడు వారు గుజరాత్‌కు సంబంధించిన సమస్యలు వినకుండా.. తమ మొబైల్ ఫోన్‌లు చూసుకుంటూ, ఇతర విషయాలతో పరధ్యానంలో ఉండిపోయారు. కాంగ్రెస్ నాయకత్వానికి గుజరాత్‌పై అంతగా ఆసక్తి లేదు. ప్రజల వద్దకు చేరుకోవడానికి ఆ పార్టీ వద్ద సరైన రోడ్ మ్యాప్ లేదు. అందుకే అది ప్రతిచోటా తిరస్కరణకు గురవుతోంది' అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఎవరి హార్దిక్!!పాటిదార్ ఉద్యమంతో ప్రజాదరణ పొందిన హార్దిక్ పటేల్.. గుజరాత్‌కు చెందిన యువ నాయకుడు, విద్యా ర్థి నాయకుడు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఈ సందర్భంలోనే పలు మార్లు అరెస్టు కూడా అయ్యారు. ముఖ్యంగా దేశంలో అసహన రాజకీయాలు జరుగుతున్నాయంటూ.. తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో దేశవ్యాప్తంగా పటేల్ గుర్తింపు పొందారు.