ఎన్టీఆర్ తనయుడు - ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది - టీడీపీ నేత హరికృష్ణ విపక్ష నేత జగన్ తో ముచ్చట్లాడడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసలే హరికృష్ణను చంద్రబాబు పక్కన పెడుతుండడం.... హరికృష్ణ రాజ్యసభ సీటుకోసం నానా పాట్లు పడుతుండడంతో ఆయన జగన్ గూటికి చేరుతారా అన్న అనుమానాలు కొందరు వ్యక్తంచేస్తున్నారు. తన సోదరి పురంధేశ్వరి బాటలోనే ఆయన కూడా తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీని పదవి కోసం వీడడానికి సిద్ధపడతారా అన్న అనుమానాలను కొందరు వ్యక్తంచేస్తున్నారు.
గుంటూరులో జరిగిన వైసీపీ నేత గొట్టిపాటి భరత్ వివాహానికి హాజరైన జగన్, హరికృష్ణ… కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారట. వారు మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారో లేదంటే పిచ్చాపాటీగా ఏదో మాట్లాడుకున్నారో తెలియదు కానీ, ఆ ఏమీ తెలియకపోవడం అన్నది ఇప్పుడు అందరిలోనూ రకరకాల చర్చకు దారితస్తోంది. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల్లోనూ దీనిపై క్లారిటీ లేకపోవడంతో ఇద్దరూ ఏదో కీలక విషయంపైనా చర్చించుకుని ఉండొచ్చని అంటున్నారు.
ఒకప్పుడు టీడీపీని వీడి పురంధేశ్వరి కూడా కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రయ్యారు. ఇప్పుడు రాజ్యసభ సీటుపై ఆశపడుతున్న హరికృష్ణ టీడీపీలో ఆ ఆశ నెరవేరే సూచనలు కనిపించకపోవడంతో జగన్ ను ఆశ్రయిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. అయితే... హరికృష్ణను ఇప్పటికప్పుడు పార్టీలోకి తీసుకొచ్చి పదవులు ఇవ్వడం వల్ల జగన్ కు వచ్చే లాభమేమీ ఉండదన్న వాదనా వినిపిస్తోంది. హరికృష్ణ పదవి కోసం వైసీపీలో చేరితో మాత్రం టీడీపీ నష్టం ఉండదు... వైసీపీకి లాభం ఉండదు కానీ హరికృష్ణ ఇమేజికి మాత్రం భారీగా డ్యామేజి జరగడం ఖాయమని అంటున్నారు.