తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో మనగలగాలంటే.. చంద్రబాబునాయుడును ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే.. దానికి జై కొట్టి.. ఆయనను కీర్తిస్తే తప్ప.. పార్టీలో మనుగడ అసాధ్యం అనే సంగతి ఆ పార్టీలో అందరికీ తెలుసు. అలాంటిది.. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామారావు తనయులకు తెలియకుండా ఉంటుందా? అందుకే నందమూరి హరికృస్ణ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్ కావాలని అనుకుంటున్నారో ఏమో తెలియదు గానీ.. తాజాగా చంద్రబాబు నిర్ణయానికి జై కొడుతున్నారు.
కేంద్రంలోని ఎన్డీయే సర్కారునుంచి - కూటమినించి తమ పార్టీ వైదొలగడం మాత్రమే కాకుండా.. అవిశ్వాసాన్ని తామే ప్రతిపాదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించిన నేపథ్యంలో హరికృష్ణ ఆ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ అనేదే తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడడం అనే నినాదంతో పుట్టిందని.. ఇప్పుడు కూడా చంద్రబాబునాయుడు అదే పని చేస్తున్నారని ఆయన అంటున్నారు. నిజమే కావొచ్చు... కానీ అదే తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ఇన్నాళ్లూ చంద్రబాబునాయుడు మోడీ పాదాల వద్ద ఎందుకు తాకట్టు పెట్టారు. ఇవాళ బావగారి భజన చేయడానికి ముందుకు వస్తున్న నందమూరి హరికృప్ణ ఇన్నాళ్లుగా ఆత్మగౌరవ తాకట్టు ప్రహసనం నడుస్తున్న రోజుల్లో కనీస మాత్రంగా కూడా స్పందించలేదు ఎందుకు . ఇదంతా చాలా సందేహాస్పదమైన విషయాలు.
నందమూరి హరికృష్ణ మొన్న మొన్నటి దాకా పార్టీలో వైభవ స్థానాన్నే అనుభవించారు. ఆయనకు కంటిన్యువస్ గా రాజ్యసభ స్థానాన్ని కేటాయించే ఉంచారు. వ్యవస్థాపకుడి వారసుడిగా ఆ మాత్రం మర్యాద ఇచ్చారు. కానీ.. ఒకసారి ఆయన పార్టీ అధ్యక్ష స్థానం తనకు కావాలన్నట్లుగా పావులు కదిపేసరికి చంద్రబాబు అలర్ట్ అయి ఒక తొక్కు తొక్కారు. అప్పటినుంచి హరికృష్ణ అసలు రాజకీయాల్లోనే లేకుండాపోయారు.
తీరా ఇప్పుడు బాబు ఆత్మగౌరవ నిర్ణయాలను కీర్తిస్తూ మీడియా ముందుకు వస్తున్నారంటే.. అందులో ఏదైనా ప్రత్యేకత ఉందా అని జనం అనుకుంటున్నారు. టీడీపీతో పవన్ కల్యాణ్ సంబంధాలు సరిగా ఉన్నప్పుడు పెద్దగా రియాక్ట్ కాని హరికృష్ణ.. టీడీపీపై పవన్ విమర్శలు చేసిన రెండో రోజునే మీడియా ముందుకు రావటం గమనార్హం. చూస్తుంటే.. రానున్న రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ సైతం సీన్లోకి తీసుకొస్తారా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.