సోష‌ల్ మీడియా జోలికి వెళ్ల‌ద్దంటున్న హ‌రీశ్‌

Update: 2017-12-22 12:34 GMT
తెల‌గాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు - మంత్రి హ‌రీశ్‌ రావు వాక్చాతుర్యం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయం అవ‌స‌రం లేదు. టీఆర్ ఎస్ ట్ర‌బుల్ షూట‌ర్‌ గా పేరున్న హ‌రీశ్‌ రావు త‌న వ్య‌వ‌హార‌శైలితో పార్టీ నేత‌ల‌ను ఆక్టుకుంటారు. అదే రీతిలో యూత్‌ లో సైతం ఫ్యాన్స్‌ ను సందదించుకున్నారు. ఇప్పుడు తాజాగా హ‌రీశ్ ఫాలోవ‌ర్ల జాబితాలో విద్యార్థులు కూడా చేరారు. ఓ కథ చెప్ప‌డం వ‌ల్ల. చదువుకునే విద్యార్థులంటే మంత్రి హరీష్‌ రావుకు ఎనలేని అభిమానం. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు తన నియోజకవర్గం సిద్దిపేటలో ఉచితంగా బోధన ఇప్పించడం.. పుస్తకాలు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు హరీష్‌ రావు చేస్తుంటారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతూ.. ధైర్యాన్ని ఇస్తుంటారు మంత్రి హరీష్‌ రావు. ఇవాళ కూడా గద్ద పిల్ల కథ చెప్పి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు.

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ - స్వర్గీయ జి.వెంకటస్వామి తృతీయ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌ రావు..విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి గద్ద పిల్ల కథ చెప్పారు. ఫేస్‌ బుక్ - ట్విట్టర్‌ కు విద్యార్థులు దూరంగా ఉండాలని కోరారు. ఈ రెండు మూడు సంవత్సరాలు సోషల్ మీడియాకు దూరంగా ఉండి.. తల వంచి చదువుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. విలువైన సమయాన్ని వృథా చేసి సోషల్ మీడియాకు కేటాయిస్తే జీవితాంతం తల దించుకొని బతకాల్సి వస్తదన్నారు మంత్రి. కొన్నాళ్ల పాటు ఫేస్‌ బుక్ - ట్విట్టర్‌కు దూరంగా ఉండి.. చదువు మీద ధ్యాస పెట్టి ఉద్యోగం సాధిస్తే.. ఆ తర్వాత తల ఎత్తుకొని బతకువచ్చు అని చెప్పారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు గద్ద పిల్ల కథ చెప్పారు మంత్రి.

హరీష్‌ రావు మాటల్లో ఆ కథ..ఇది ‘ఒక కోడి కొన్ని గుడ్లను పెట్టింది. ఆ గుడ్లలో గద్ద గుడ్డు కలిసిపోయింది. తన గుడ్లతో పాటు గద్ద గుడ్డును కూడా కోడి పొదిగింది. మొత్తానికి పిల్లలు బయటకు వచ్చాయి. ఒక రోజు ఆకాశంలో గద్ద ఎగురుతూ కనిపించింది. దీంతో కోడి పిల్లలు బయపడి అక్కడే ఉన్న చెట్ల పొదల్లోకి ఉరికాయి. ఆ సమయంలో ఆకాశంలో ఉన్న గద్ద పిల్లను చూసి.. ఆ గద్ద పిల్ల ఏమనుకుందంటే.. నాకు కూడా అలా పెద్ద రెక్కలు ఉంటే ఆకాశంలో ఎంత మంచిగా ఎగిరేదాన్నో అని అనుకుంది. కానీ తనకు రెక్కలు పెద్దగా ఉన్నాయన్న విషయం తెలియదు. ఎందుకంటే కోడి పిల్లల వెంబడి తిరిగింది కాబట్టి.. ఆ విధంగానే ఆలోచిస్తుంది. ఈ కథను ఎందుకు చెప్పానంటే.. మీ అందరిలో కూడా తెలివితేటలున్నాయి. శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం - పట్టుదల చాలా ముఖ్యం. ప్రణాళికతో.. శ్రద్ధతో చదివితే విజయం సాధ్యం. 2001లో సీఎం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారు. పలువురు హేళన కూడా చేశారు. అవేమీ పట్టించుకోకుండా.. పట్టుదలతో పోరాటం చేసి అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించి చూపించారు. ఇవాళ కాకా పెట్టినటువంటి కాలేజీలో మీరు చదవడం అదృష్టం. అవకాశాలను వినియోగించుకోవాలి. తల్లిదండ్రుల్లో పేదరికాన్ని తొలగించాలని మీరంతా కష్టపడాలి’ అని విద్యార్థులకు హరీష్‌రావు చక్కటి సందేశాన్ని ఇచ్చారు.
Tags:    

Similar News