సమస్య ఎక్కడ ఉంటే తాము అక్కడ ఉంటామంటూ భరోసా ఇస్తూ.. దూసుకెళుతున్న తెలంగాణ మంత్రులు హరీశ్.. ఈటెల ఊహించని విధంగా పెను ప్రమాదంలో చిక్కుకొన్నట్లే చిక్కుకొని బయటపడ్డారు. అధికారులకు ముచ్చెమటలు పోయించిన ఈ ఘటన అధికార వర్గాల్లో కొత్త చర్చను రేపటమే కాదు.. మంత్రుల ఉత్సాహాన్ని ప్రశ్నించేదిగా ఉండటం గమనార్హం.
ఆదివారం అదిలాబాద్జిల్లా లక్సెట్టిపేట వద్ద గోదావరి పుష్కరాల్ని పరిశీలించేందుకు మంత్రులు ఈటెల రాజేందర్.. హరీశ్ లు పడవలో ప్రయాణం అయ్యారు. అయితే.. గోదారి మధ్యలో పడవ ఆగిపోయింది. దీంతో.. మంత్రుల కోసం ఎదురుచూస్తున్న అధికారులు తీవ్ర టెన్షన్ కు గురి అయ్యారు. అయితే.. సమయానుకూలంగా బోట్ లోని మెకానిక్ వ్యవహరించి..రిపేర్ చేయటంతో వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.
గోదారి మధ్యలో బోటు ఆగిపోవటంతో ఏం చేయాలో తోచక అధికారులు పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. అయితే.. ఇంత టెన్షన్ పెట్టిన ఘటన జరిగినా.. మంత్రులు పెద్దగా కంగారు పడకుండా స్థిమితంగా ఉండటం గమనార్హం. మొత్తానికి మంత్రుల దూకుడు అధికారుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందనటంలో సందేహం లేదు. మంత్రులు సైతం.. ముంచుకొచ్చే ప్రమాదాల్ని గురిస్తూ పని చేస్తే మంచిదేమో.