టీఆర్ ఎస్ పార్టీ నాయకుడు - మంత్రి హరీశ్ రావు సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులోనూ చేరికల కార్యక్రమం ఆయన చేతుల మీదుగా జరగడం మరో విశేషం. ఇలాంటి ప్రత్యేక అంశాలు పక్కనపెడితే..ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన టీడీపీ - బీజేపీ - కాంగ్రెస్ కు చెందిన పలువురు సర్పంచ్ లు - ఎంపీటీసీలు - మాజీ జెడ్పీటీసీలు పెద్దసంఖ్యలో తెలంగాణ భవన్ లో హరీశ్ రావు సమక్షంలో టీఆర్ ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో మహబూబ్ నగర్ జిల్లా దశను మారుస్తున్నామన్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ కేసులు వేస్తోందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులకు కొర్రీలు పెడుతూ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏనాడూ మాటమీద నిలబడలేదన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోలేదని ఉత్తమ్ అబద్ధ్దాలు మాట్లాడుతున్నారని, వారు అడ్డుకుంటున్నారని చెప్పడానికి ఆధారాలను చూపిస్తానని చెప్పారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేసిన పవన్ కుమార్ రెడ్డి - హర్షవర్ధన్ రెడ్డి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోర్టుల్లో - గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేశారని చెప్పారు. ఈ అంశాలను ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధ్దంగా ఉన్నానని దీనిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధ్దమని, అవసరమైతే గాంధీభవన్ కు వస్తానని ఆయన కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులను ఉపసంహరించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలను మోసం చేసేలా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. మహబూబ్ నగర్ లో పులులు ఉన్నాయని, అడవులు ఉన్నాయని, వాటికి నష్టం వాటిల్లుతుందని కేసులు వేశారన్నారు. అక్కడ పులులు కాదు కదా.. గండు పిల్లులు కూడా లేవు.. అడవులు కాదు కదా ఆముదం చెట్లు కూడా లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్రతో 152 మీటర్లకు ఒప్పందం చేసుకుంటే.. 148 మీటర్లకు ఒప్పందం చేసుకున్నట్టు ఉత్తమ్ ఆరోపించారని హరీశ్ రావు గుర్తుచేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను బయటపెడితే బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచే రాజ్ భవన్ కు పోయి సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ విసిరారని - అయితే ఎలాంటి ఆధారాలు బయటపెట్టకుండా ఉత్తమ్ కుమార్ తోకముడిచారన్నారు. ఒక్కనాడు కూడా మాటమీద నిలబడని వ్యక్తి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని, గాలిమాటలు మాట్లాడటం ఉత్తమ్ కుమార్ కు అలవాటే అన్నారు. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నేతలకు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కనపడుతున్నది కానీ ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు మాత్రం కనపడటంలేదన్నారు. కర్ణాటక మంత్రి రేవణ్ణ ఇక్కడి గొర్రెల పంపిణీ పథకం - మిషన్ భగీరథను అభినందించారని, పంజాబ్ మంత్రి సిద్దూ ఇక్కడి ఇసుక విధానం బాగుందని అభినందించారని గుర్తుచేశారు.అందుకే వారికి కంటిపరీక్షలు ఉచితంగా చేయిస్తామని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.