త‌న మాట‌తో వైఎస్ ను గుర్తు చేసిన హ‌రీశ్‌

Update: 2018-08-22 05:23 GMT
త‌న మేన‌మామ కేసీఆర్ మాదిరే మాట‌లు చెప్పే నేత‌గా తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ గా చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌ణాంకాల్ని ప్ర‌స్తావిస్తూనే.. దూకుడు వ్యాఖ్య‌లు చేయ‌టం.. పంచ్ మాట‌ల్ని చెప్ప‌టం హ‌రీశ్ కు అల‌వాటుగా చెప్పాలి. తాజాగా ఆయ‌న చేసిన ఒక వ్యాఖ్య‌.. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని గుర్తుకు తెచ్చేలా చేసింది.

తన హ‌యాంలో వాన‌లు సంవృద్ధిగా ప‌డ‌టాన్ని అప్ప‌ట్లో వైఎస్.. వాన దేవుడు త‌మ పార్టీలో చేరిన‌ట్లుగా వ్యాఖ్య‌లు చేసేవారు. త‌మ పార్టీలో చేరిన వాన‌దేవుడి కార‌ణంగా వ‌ర్షాలు ప‌డ‌టాన్ని వైఎస్  చెప్పినా.. వాన‌ మాట‌లు వ‌ర్క్ వుట్ కాలేద‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ మాట‌కు వ‌స్తే.. అదే వాన కార‌ణంగా ఊహించ‌ని విషాదం చోటు చేసుకున్న వైనం తెలిసిందే. అప్ప‌టినుంచి కాంగ్రెస్ నేత‌ల నోటి నుంచి వాన దేవుడు మాట వ‌చ్చింది లేదు.

ఇంత‌కాలానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ నోటి నుంచి వైఎస్ మాట రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే.. గ‌త అనుభ‌వాన్ని చూస్తే.. వాన‌దేవుడికి పార్టీని అపాదించ‌టం స‌రికాద‌ని.. ఆ సెంటిమెంట్ స‌రిగా వ‌ర్క్ వుట్ కాలేద‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. వాన‌దేవుడి ప్ర‌స్తావ‌న‌ను హ‌రీశ్  ఎందుకు తెచ్చారంటే.. హ‌రిత హారం కార్య‌క్ర‌మంలో భాగంగా సిద్దిపేట‌లో నిర్వ‌హించిన ఒక కార్య‌క్ర‌మంలో ఆయ‌న నోటి నుంచి వాన‌దేవుడి మాట వ‌చ్చింది.

త‌మ పాల‌న‌లో నిజాయితీ ఉంద‌ని.. న్యాయం ఉంద‌ని.. అందుకే వాన‌దేవుడు కూడా టీఆర్ ఎస్ పార్టీలో చేరాడ‌ని.. రైతుల కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌కు త‌న‌వంతు సాయాన్ని అందించిన‌ట్లుగా వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు.. రిజ‌ర్వాయ‌ర్లు.. చెరువులు.. కుంట‌ల్లోకి నీళ్లు వ‌చ్చేలా చేసిన‌ట్లుగా వ్యాఖ్యానించారు. వ‌ర్షాల‌ను చూసి కాంగ్రెస్ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని.. చెరువులు.. రిజ‌ర్వాయ‌ర్ల‌లోకి నీళ్లు వ‌స్తుంటే కాంగ్రెస్ నేత‌ల క‌ళ్ల‌ల్లో నుంచి క‌న్నీళ్లు వ‌స్తున్న‌ట్లుగా ఎద్దేవా చేశారు. ఈ క్ర‌మంలో వాన‌దేవుడు సైతం త‌మ పార్టీలో చేరిన‌ట్లుగా వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News