తెలంగాణ రాష్ట్ర మంత్రుల తీరు ఎంత భిన్నంగా ఉంటుందో మాటల్లోకాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. సమస్యలు ఎదురైతే.. వారి స్పందన ఎలా ఉంటుందో ఆశేష ప్రజానీకానికి అర్థమవుతోంది. గోదావరి పుష్కరాల సందర్భంగా తమ తీరుతో విపరీతంగా ఆకట్టుకోవటమే కాదు.. తమ స్పీడ్ తో రాజకీయ ప్రత్యర్థులు సైతం విస్మయం చెందేలా వ్యవహరిస్తున్నారు.
గోదావరి పుష్కరాల్ని పురస్కరించుకొని.. ట్రాఫిక్ జాం ఏర్పడితే.. దాన్ని క్లియర్ చేసేందుకు మంది.. మార్బలంతో హడావుడి చేయకుండా.. సింఫుల్ గా బుల్లెట్ వేసుకొని.. మంది మధ్యలోకి దూసుకుపోతున్నారు తెలంగాణ మంత్రులు. ఈ మధ్యన భద్రాచలంలో ట్రాఫిక్ జాం అయి.. యాత్రికులు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు.. హరీశ్ రావులు బైక్ మీద వెళ్లి సరిదిద్దటం తిలిసిందే.
తాజాగా అలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుంది. వీవీఐపీగా భద్రతల్ని కోరుకుంటూ హడావుడి చేసే మంత్రులకు భిన్నంగా శనివారం మంత్రులు హరీశ్ రావు.. ఈటెల రాజేందర్ లు వ్యవహరించారు.
ప్రోటోకాల్ని పక్కన పెట్టేసి.. సాదాసీదా వ్యక్తులన్నట్లుగా రోడ్ల మీదకు వచ్చిన హరీశ్.. ఈటెలను చూసిన ప్రజలు సైతం అవాక్కు అయ్యే పరిస్థితి. భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడిన నేపథ్యంలో ధర్మపురి వైపు వెళ్తున్న రోడ్లు కిక్కిరిపోయి.. వాహనాలు కదలని నేపథ్యంలో హరీశ్ రంగంలోకి దిగారు. బుల్లెట్ ను బయటకు తీసిన ఆయన.. తన వెనుక ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ను వెంట బెట్టుకొని దూసుకెళ్లిన ఆయన.. ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు.
ఈ మధ్యనే భారీ రోడ్డు యాక్సిడెంట్ అయ్యి కోలుకొంటున్న ఈటెల.. తన కాలునొప్పిని సైతం పక్కన పెట్టి.. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం పడిన తపన చూస్తే ఆశ్చర్యంతో నోట మాట రాని పరిస్థితి. ఒక చేత్తో వాకీటాకీ.. మరో చేత్తో కర్ర పట్టుకొని ట్రాఫిక్ క్లియర్ చేసేపనిలో పడ్డారు. ఒకదశలో రోడ్డుకు మధ్యన ఆగిపోయిన కారును పక్కకు నెట్టే ప్రయత్నంలో మంత్రి హరీశ్ స్వయంగా.. మిగిలిన వారితో కలిసి కారు నెట్టారు.
ట్రఫిక్ జాంను అధిగమించేందుకు ఈ స్థాయిలో కష్టపడ్డారు. సెక్యూరిటీలను పక్కన పెట్టి.. బుల్లెట్ మీద బయటకు వచ్చిన ఈ ఇద్దరు మంత్రులు ట్రాఫిక్ జాంను పరిష్కరించి మనసుల్ని దోచుకున్నారు. తాము పర్యవేక్షిస్తున్న ప్రాంతంలో ట్రాఫిక్ జాం అంటే మాత్రం దూసుకెళ్లి మరీ.. ఇలా క్లియర్ చేయటం టీ మంత్రులకు మాత్రమే సాధ్యమేమో.