వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం రాజుకుంటోంది. రాజకీయ పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడటం మొదలైంది. తెలంగాణ అధికారపక్షంపై కాంగ్రెస్.. బీజేపీ నేతలు విరుచుకుపడటం.. మరోవైపు.. బహిరంగ సభల్లో సామాన్యులు సైతం చికాకు పెట్టే ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో.. హరీశ్ తన అమ్ముల పొదిలోని భావోద్వేగ బాణాన్ని బయటకు తీశారు.
తాజాగా.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన హరీశ్.. చాలా కాలం తర్వాత ఆంధ్రా పేరును బయటకు లాగారు. వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఓడిపోతే.. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా? అంటూ సవాలు విసిరారు.
సవాలు విసరటంతో సరిపెట్టని హరీశ్.. ఆంధ్రా నాయకుల పల్లకీలు మోసి.. తెలంగాణ ప్రజల్ని పాడెక్కించిన ఘనత కాంగ్రెస్ ను తిట్టి పోసిన ఆయన.. తెలంగాణకు సాగునీరు లేకుండా చేశారంటూ మండిపడ్డారు. అంతేకాదు.. కాంగ్రెస్ నాయకులు ఎంగిలి మెతుకుల కోసం రాష్ట్రాన్ని బలి చేశారంటూ ఆరోపించారు. ఎవరెన్ని చేసినా.. చివరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే అన్న విషయాన్ని వదిలసి.. కాంగ్రెస్ ను ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్న హరీశ్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఉడికిపోతున్నారు.