సీన్లోకి దిగిన హరీశ్.. కనిపిస్తే క్లాస్ పీకుతున్నారు

Update: 2020-03-31 04:29 GMT
కరోనా కారణంగా చాలామంది నేతలు అస్సలు కనిపించటం లేదు. గ్రౌండ్ లో ఎవరికి వారు పనులు చేసుకుంటున్నా.. మీడియాలో దర్శనమిస్తున్న పరిస్థితి లేదు. ఆ కోవలోకే వస్తారు తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు. తానేం చేసినా సమ్ థింగ్ స్పెషల్ అన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. తాజాగా సిద్దిపేటలోని రోడ్ల మీదకు వచ్చిన ఆయన..యాక్టివ్ గా పలు వీధుల్లో తిరిగారు.

ఈ సందర్భంగా టూ వీలర్ మీద వెళ్లే సిద్దిపేట వాసులకు క్లాసులు పీకారు. ఫ్యామిలీతో కలిసి వెళుతున్న వాహనదారుడ్ని ఆపిన హరీశ్.. కరోనా వైరస్ మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అందరిని ఇళ్లల్లో ఉండమంటే.. బండి మీద ఫ్యామిలీని తీసుకొని ఎక్కడకు బయలుదేరావు? అని ప్రశ్నించారుు.
దీనికి సదరు వాహనదారులు ఏదో చెప్పే ప్రయత్నంచారు. ఓ పక్క వైరస్ తో ప్రపంచం మొత్తం గడగడా వణుకుతుంటే.. అదేమీ పట్టనట్లుగా రోడ్ల మీదకు ఎలా వస్తున్నారు? ఇలా బయటకు రావటం ముప్పు అని తెలీదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

‘‘అధికారులు మీ కోసం ఇంతలా కష్టపడుతున్నారు. సహకరించరా? మీకు బాధ్యత లేదా? ఇలాంటి వైఖరితోనే వ్యవహరిస్తే కేసులు పెట్టేస్తా. అందులో వేరే మాటే లేదు’’ అని తీవ్ర స్వరంతో వార్నింగ్ ఇచ్చారు. లాక్ డౌన్ వారానికి పైనే అమలు చేస్తున్నా.. తాజాగా హరీశ్ చేసిన హడావుడి సిద్దిపేటలో హాట్ టాపిక్ గా మారింది.తెలంగాణ అధికారపక్ష నేతలు ఎవరికి వారుగా రోడ్ల మీదకు వచ్చి.. ప్రజల్ని కట్టడి చేయాల్సిన అవసరముంది.
Tags:    

Similar News