తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, రాష్ట్ర మంత్రి హరీశ్ రావుకు మాస్ మైలేజ్ ను ఎలా పొందాలో తెలిసినంతగా మరెవరికి తెలియదనే టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తుంటుంది. అయితే ఆషామాషీ సహాయాలు, స్పందనలతో పాటు మానవత దృక్పథంతో కూడిన అంశాల విషయంలో కూడా తన స్పందన ఆసక్తికరంగా ఉంటుందని హరీశ్ రావు మరోమారు నిరూపించుకున్నారు. తన నెల జీతాన్ని ఉదాత్తమైన అంశానికి ఖర్చు చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వితంతు మహాసభ జరిగింది. వితంతువులపై వివక్షను నిరసిస్తూ ఏర్పాటు చేసిన ఈ మహాసభలో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు.
దేశంలోనే తొలిసారిగా 10 వేల మంది వితంతువులతో మహాసభను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. వితంతువుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. భర్త చనిపోయిన తర్వాత మళ్లీ వివాహం చేసుకోవడం తప్పుకాదన్నారు. వితంతు వివాహాలపై వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చిస్తామని హరీశ్ రావు తెలిపారు. ఒక నెల జీతాన్ని వితంతువులకు ఇస్తున్నానని మంత్రి ప్రకటించారు. హరీశ్‌రావు చేసిన ప్రకటనకు సబ నుంచి హర్వద్వానాలు వినిపించాయి. ఈ సందర్భంగా మరిన్ని అంశాలను హరీశ్ రావు ప్రకటించారు.
మహిళల రక్షణ కోసం గ్రామాలకు షీ టీమ్స్‌ను విస్తరిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. బాల్యవివాహాల వల్ల వితంతువుల సంఖ్య పెరుగుతోందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కల్యాణలక్ష్మి వల్ల బాల్య వివాహాలు ఆగిపోతున్నాయని తెలిపారు. ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న గుడుంబాను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. గుడుంబాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉద్ఘాటించారు. సామాజిక దురాచారాల నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/