హ‌రీశ్‌ ఆఖ‌రికీ ఇలా మారిపోయారు

Update: 2016-01-05 11:50 GMT
త‌న్నీరు హ‌రీశ్ రావు... తెలంగాణ రాష్ర్ట స‌మితిలో కీల‌క నేత‌. టీఆర్ ఎస్ అధినేత‌-తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అల్లుడిగానే కాకుండా....త‌న సొంత స‌త్తాతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న మాస్ లీడ‌ర్‌. తెలంగాణ రాష్ర్ట స‌మితి ఏర్పాటు నుంచి రాష్ర్టం సిద్ధించే వ‌ర‌కు హ‌రీశ్ నిరంత‌రాయంగా శ్ర‌మించారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత మంత్రి ప‌దివి చేప‌ట్టారు. మ‌రో మంత్రి - కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ హ‌వా జోరుగా సాగుతున్న నేప‌థ్యంలో కేసీఆర్ కుటుంబ స‌భ్యుడు అయిన‌ప్ప‌టికీ హ‌రీశ్ ఒకింత సంయ‌మ‌నం పాటిస్తున్నారు. ఆఖ‌రికి హ‌రీశ్ రావు ప‌రిధిలోకి వ‌చ్చే రైతు బ‌జార్ల‌ను కూడా కేటీఆర్ ప్రారంభించేస్తున్నా హ‌రీశ్ రావు త‌న ప‌నేదో తాను చేసుకోవ‌డం ఉత్త‌మం అనుకుంటూ ముందుకువెళుతున్నారు.

అయితే నిబ‌ద్దుడైన కార్య‌క‌ర్త‌గా - మామ కేసీఆర్‌ పై ఉన్న అభిమానంతో హ‌రీశ్‌ రావు కొత్త బాధ్య‌త‌లు తలెత్తుకున్నార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెప్తున్నారు. త్వ‌ర‌లో ఉప ఎన్నిక‌లు జ‌రిగే మెద‌క్ జిల్లా నారాయ‌ణ‌ఖేడ్‌ లో కారును గెలిపించే బాధ్య‌త త‌లెత్తుకున్నార‌ని వివ‌రిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఖేడ్ ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల కాలేదు. ఈనెల లేదా ఫిబ్ర‌వ‌రీలో వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో నారాయ‌ణఖేడ్‌ లో సుడిగాలి ప‌ర్య‌ట‌న పెట్టుకోవ‌డం దీనికి నిద‌ర్శ‌నంగా చెప్తున్నారు.

తాజాగా నారాయ‌ణ‌ఖేడ్‌ లోని మనూరు మండలం ఏస్లీలో పర్యటిస్తూ మిషన్ కాకతీయ రెండోదశలో భాగంగా జిల్లాలో రూ. 400 కోట్లతో 1760 చెరువులకు మరమ్మతులు చేపట్టామని తెలిపారు. మిషన్‌ కాకతీయలో భాగంగా నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి రూ. 31 కోట్లు కేటాయించామని చెప్పారు. నారాయణఖేడ్‌ మండలం ఘాట్‌ లింగంపల్లి చెరువును సాగునీటి ప్రాజెక్టుగా మారుస్తామని చెప్పారు. మూడేళ్లలో నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి సాగు, తాగు నీరందిస్తామని తెలిపారు. అనంత‌రం హోటల్‌ వద్దకు మంత్రి హరీష్‌ రావు వెళ్లి సరదాగా టీ తాగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళ్లు మొక్కి అయినా నారాయణఖేడ్‌ అభివృద్దికి నిధులు తెస్తానని చెప్పారు. టీఆర్‌ ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక రూ.200 ఉన్న పెన్షన్‌ ను రూ.1000 కి పెంచామని తెలిపారు. నారాయణఖేడ్‌ రాబోయే ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

అయితే నారాయ‌ణఖేడ్ అభివృద్ధి గురించి హ‌రీశ్ సీఎం కేసీఆర్‌ కు వివ‌రిస్తే స‌రిపోతుంద‌ని ఆయ‌న కాళ్లు మొక్కాల్సిన అవ‌స‌రం లేద‌ని కార్య‌క‌ర్త‌లు చెప్తున్నారు. హ‌రీశ్ రావు హ‌ఠాత్తుగా ఎందుకు ఇంత పెద్ద మాట వాడారంటూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News