కేసీఆర్ సమీక్షకు హరీష్ రాలేదు.. ఏం జరుగుతోంది?

Update: 2018-12-16 07:37 GMT
టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియామకమైనప్పటి నుంచి హరీష్ రావు పరిస్థితి ఏంటి? ఆయన ఏమవుతారు అన్న ఆసక్తి - టెన్షన్ అందరిలోనూ నెలకొంటోంది. హరీష్ రావు గురించి ఏదో ఒక వార్త ప్రతిరోజు జనంలో నానుతూనే ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హరీష్ రావును వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీచేయించి రాష్ట్ర రాజకీయాలకు దూరం చేయనున్నారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతోంది. అదే సమయంలో  తెలంగాణ కొత్త కేబినెట్ లో హరీష్ రావుకు ఈసారి భారీ నీటిపారుదల శాఖ కూడా కేటాయించడం లేదనే మరో వార్త కూడా వ్యాప్తి చెందుతోంది.

టీఆర్ ఎస్ ట్రబుల్ షూటర్ గా పేరు గాంచిన హరీష్ రావుకు మంచి పనివంతుడు.. పనిరాక్షసుడిగా పేరుంది.  గడిచిన నాలుగేళ్లుగా హరీష్ రావు తెలంగాణ ప్రాజెక్టులను పరుగులు పెట్టించి పూర్తి చేయిస్తున్నాడు.  తాజాగా హైదరాబాద్ లో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ 7 గంటల పాటు సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించారు.  అయితే గడిచిన సారి నీటిపారుదల శాఖ మంత్రిగా విశేష సేవలందించిన హరీష్ రావు ఈ సమావేశానికి హాజరుకాకపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. కరీంనగర్ ఎంపీ వినోద్ - బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రమే ఈ సమావేశంలో పాల్గొన్నారు.

దీన్ని బట్టి ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సారి కొత్త కేబినెట్ లో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి అవకాశం దక్కబోతోందనే చర్చ మొదలైంది. హరీష్ రావు ప్రస్తుతం మంత్రి కాదు.. అయినా గడిచిన సారి ఇరిగేషన్ మంత్రి.. ఇప్పుడు ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే హోదాలోనైనా ముఖ్యమంత్రి సమావేశానికి హాజరు కావచ్చు. కానీ ఆయన రాకుండా ప్రశాంత్ రెడ్డి పాల్గొనడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.

హరీష్ రావు.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షకు హాజరుకాకపోవడం ఆయన అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. హరీష్ కు కేసీఆర్ ప్రాధాన్యం తగ్గించారా..? ఈసారి కీలకమైన ఇరిగేషన్ శాఖను ఇవ్వరా.? ఎంపీగా పంపిస్తారా అన్న భయం హరీష్ వర్గాన్ని వెంటాడుతోంది. కేటీఆర్ రాజకీయ భవిష్యత్ కోసమే హరీష్ రావుకు ప్రాధాన్యం తగ్గించబోతున్నారా అన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. మరి రాబోయే మంత్రి వర్గ విస్తరణ తర్వాతే హరీష్ రావు భవిష్యత్ ఏంటో తేలే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News