తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తెలంాణ రాష్ట్ర సమితి ప్రభంజనమే సృష్టించింది. ఎన్నికల ముందు గట్టి పోటీ అంటూ జరిగిన ప్రచారాన్ని తిప్పి కొడుతూ ఏక పక్ష విజయం సాధించింది. ఇంత మెజారిటీ.. ఈ స్థాయి ఓట్ల శాతం ఎవ్వరూ ఊహించనిదే. ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ శ్రేణుల ఉత్సాహం మామూలుగా లేదు. ఈ ప్రభంజనంపై కేసీఆర్ మేనల్లుడు.. తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించారు. సిద్ధి పేటలో రికార్డు స్థాయిలో లక్షకు పైగా మెజారిటీ సాధించిన హరీష్.. విజయోత్సాహంలో మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే...
‘‘ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ శ్రీరామకృష్ణ. నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన సిద్ధిపేట ప్రజలకు నా ధన్యవాదాలు. టీఆర్ ఎస్ కార్యకర్తలకు రుణపడి ఉంటా. ఇది సిద్ధి పేట ప్రజల విజయం.. తెలంగాణ ప్రజల విజయం. ఈ ఎన్నికల్లో గెలిచింది తెలంగాణ ప్రజలు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధికి వారు మద్దతిచ్చారు. 90 సీట్లలో గెలవడం కేసీఆర్ అన్నట్లుగా చరిత్రాత్మకం. ఆయన నాయకత్వాన్ని ప్రజలు ఇష్టపడ్డారు. ప్రజా కూటమితో జట్టు కట్టిన పార్టీలు ఓట్ల కోసం ప్రజలకు డబ్బులు పంచాయి. మద్యం పంచారు. కానీ ప్రజలు తాము వాటికి అమ్ముడుబోమని చాటారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రజలు ఓటేశారు. ప్రజాకూటమిలోని పార్టీలు కౌరవుల్లాంటివాళ్లు. మేం పాండవులం. ప్రతి రోజూ వాళ్లు బురదజల్లడానికే చూశారు. ఇప్పుడు ప్రజా మద్దతు మాకే అని వారికి అర్థమై ఉంటుంది. ప్రజాస్వామ్యంలో వారి పాత్రేంటో కూడా వారు తెలుసుకుని ఉంటారు’’ అని హరీష్ రావు అన్నారు.