ఇదీ హరీష్ అంటే.. గొప్ప ప్రయత్నం!

Update: 2019-07-10 09:05 GMT
గెలిచినా ఓడినా.. పదవులున్నా లేకపోయినా ప్రజల్లో ఉండి వారికి మేలు చేసే నాయకులు కొందరే ఉంటారు. అలాంటివారే హరీష్ రావు. ఇప్పుడు ఆయన చర్యలతో మరోసారి ప్రజానాయకుడు అనిపించుకున్నారు.

టీఆర్ ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. పోయినసారి భారీ నీటిపారుదల శాఖ మంత్రి కేసీఆర్ సర్కారులో కీలకంగా పనిచేసిన ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు ఈసారి మంత్రి పదవి దక్కలేదు. ఆయన అభిమానులు కలత చెందారు. టీఆర్ ఎస్ శ్రేణులు నివ్వెరపోయాయి. మంత్రి పదవులు దక్కని నేతలంతా మౌనంగా ఉంటూ స్తబ్ధత మెయింటేన్ చేస్తున్నారు. కానీ హరీష్ రావు మాత్రం జట్ స్పీడ్ తో దూసుకుపోతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మూడు నాలుగేళ్ల క్రితం హరీష్ ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట జిల్లా పదోతరగతి ఫలితాల్లో 24వ స్థానంలో ఉండేది. ఆ తర్వాత 2016-17 సిద్దిపేట 9వ స్థానానికి ఎగబాకింది. ఈ ఏడు ఏకంగా రెండోస్థానానికి చేరింది. జిల్లాలో విద్యాశాఖ బూజు దులిపి జిల్లాను రెండోస్థానం చేర్చడంలో హరీష్ రావు కృషి ఎంతో ఉంది. విద్యార్థులకు స్వయంగా బాగా చదవాలని కోరుతూ లేఖలు రాయడం దగ్గర నుంచి స్వచ్ఛంద సంస్థలు - అధికారులతో మాట్లాడి విద్యార్థులకు సాయంత్రం స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేయించి వారికి ఆకలి కాకుండా స్నాక్స్ ను హరీష్ రావు ఏర్పాటు చేయించారు. దీంతో ఈ సత్ఫలితాలు వచ్చాయి.

ఇక రాష్ట్రంలోనే అత్యధిక రోడ్డుప్రమాదాలకు నిలయంగా మారింది రాజీవ్ రహదారి. హైదరాబాద్ టు కరీంనగర్-రామగుండం వెళ్లే ఈరోడ్డు అత్యధికంగా 92 కి.మీలు సిద్దిపేట జిల్లాలో వెళుతుంది. అత్యదిక ప్రమాదాలతో అసువులు బాస్తున్నట్టు గుర్తించిన హరీష్ వెంటనే ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. పదిహేను రోజులుగా బ్లాక్ స్పాట్స్ అయిన ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ఒక్క ప్రమాదం జరకపోవడం విశేషం. రేడియం స్టిక్కర్లు బారికేడ్లు - సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులను ఉంచడంతో ప్రమాదాలు భారీగా తగ్గాయి.

ఇలా తనకు మంత్రి పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవకు పాటుపడుతానని.. సిద్ధిపేటను మరింత అభివృద్ధి పరుస్తూ హరీష్ రావు నంబర్ 1 ఎమ్మెల్యేగా నిలుస్తున్నారు. మంత్రి పదవి లేకపోయినప్పటి నుంచి సిద్ధిపేటలోనే ఉంటూ నియోజకవర్గాన్ని జిల్లాను తెలంగాణలోనే అతివేగంగా అభివృద్ధి చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.


Tags:    

Similar News