తెలుగు రాష్ట్రాలకు దిశానిర్దేకులుగా వ్యవహరిస్తున్న ఇద్దరు చంద్రుళ్లను కలిపి ఫాలో కావటం అంత తేలికైన వ్యవహారం కాదు. కానీ.. ఆ పనిని షురూ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు.. మంత్రి హరీశ్ రావు. తాజాగా ఆయన వివిధ శాఖల అధికారులతో కలిపి ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని మూడు ముక్కల్లో చెప్పాలంటే.. 12 గంటల పాటు నాన్ స్టాప్ గా జరిపి.. రాష్ట్రంలో అమలు చేస్తున్న కీలక ప్రాజెక్టులకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాల్ని తీసుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యకాలంలో పఠిస్తున్న.. ‘వేగంగా ప్రాజెక్టుల పూర్తి.. మరోవైపు కేసీఆర్ అనుసరించే సుదీర్ఘ సమీక్షల్ని కలిపి హరీశ్ అనుసరించటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఉదయం తొమ్మిది గంటలకు వివిధ శాఖలకు చెందిన అధికారులతో మొదలైన సమావేశం.. రాత్రి తొమ్మిది గంటలవరకూ నాన్ స్టాప్ గా సాగింది.
కాళేశ్వరం ప్రాజెక్టు సమీక్షతో మొదలైన ఈ రివ్యూ సమావేశం.. చెరువులు.. భూసేకరణ.. ఎత్తిపోతల పథకాలు.. విద్యుత్ ఛార్జీలు.. మిషన్ భగీరథ.. ఇసుక అవసరాలతో సహా పలు అంశాలపై సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ పనుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఏడాది లోపు పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించిన హరీశ్.. ఆసియాలోనే రికార్డు సాధించాలన్న లక్ష్యాన్ని అధికారులకు నిర్దేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2017 డిసెంబరు నాటికి తెలంగాణ పొలాలకు నీరివ్వాలని.. అందుకోసం ఇరిగేషన్.. రెవెన్యూ.. అటవీ.. విద్యుత్.. మైనింగ్ తదిరత ముఖ్యశాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.
ఖమ్మం జిల్లాలోని భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని డిసెంబరు మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని.. ఆ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ సరఫరా.. ఇతర ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం.. దేవాదుల.. అనంతగిరి.. మల్లన్నసాగర్.. రంగనాయకి సాగర్.. మేడారం.. రామడుగు ప్యాకేజీలకు అవసరమైన విద్యుత్ సరఫరా అంశాలపైనా రివ్యూ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న వివిధ ప్రాజెక్టులకు దాదాపు 30 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని లెక్క తేల్చిన హరీశ్.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సూచించారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ఎంతో కొంత మేర పూర్తి చేసి.. దాని ఫలితాల్ని తమ ఖాతాలో వేసుకోవాలన్న తపన మంత్రి హరీశ్ సమీక్షలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/