కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీచులాటలు చోటుచేసుకుని ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ సర్కారు నిర్మించదలచుకుంటున్న పాలమూరు - డిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాసి.. ఏపీ సర్కారు అడ్డుకున్నది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలను పిలిచి సమస్యను పరిష్కరించడానికి కేంద్ర మంత్రి ఉమాభారతి పూనుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఢిల్లీ రావాల్సిందిగా పిలిచారు. మూడు తేదీలు ఇచ్చి - మీకు సౌకర్యమైన తేదీలు చెబితే తేల్చేద్దాం అన్నట్లుగా కేంద్రం పూనిక వహించింది. అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇరువురు సీఎంలు మరోసారి ముఖాముఖి ఎదురుపడే సందర్భం వచ్చిందన్నమాట.
అయితే తెలంగాణ సర్కారులో విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. కేంద్రం ఏర్పాటుచేస్తున్న ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబునాయుడుతో ముఖాముఖి ఎదురుపడడం వాదించడం ఆయనకు ఇష్టం లేదని పలువురు అంటున్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వ వాదనను - ఆ ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్న ఔచిత్యాన్ని కేంద్రం వద్ద వివరించడానికి తన తరఫున నీటిపారుదల మంత్రి హరీష్ రావును పంపితే సరిపోతుందని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
నిజానికి కేసీఆర్ కు కూడా తెలంగాణలోని నీటి ప్రాజెక్టుల సమాచారం మొత్తం కంఠతా ఉంటుంది. అలాగే హరీష్ రావు కూడా చాలా సాధికారికంగా మాట్లాడగలరు. ఎంతైనా చంద్రబాబు స్థాయికి తమ తరఫున హరీష్ చాలు అన్నట్లుగా సంకేతం పంపినట్లు ఉంటుందని.. పలువురు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికే సమావేశానికి రావడానికి తన ఆమోదం తెలియజేసేశారు. అయితే కేసీఆర్ అధికారికంగా హరీష్‌ను పంపుతున్నట్లు ముందస్తుగా ప్రకటించడం మేలా? లేదా, చివరి నిమిషంలో తాను మిన్నకుండి హరీష్ ను ప్రతినిధిగా పంపితే సరిపోతుందా? సాంకేతికంగా దీనివల్ల చిక్కులు ఉండవు కదా అనే విషయంలో కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.