అందరూ ఆ ముగ్గురిచుట్టూ ప్రదక్షిణలే!

Update: 2015-10-16 04:20 GMT
తెలంగాణలో చిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూత్రప్రాయంగా అంగీకరించేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఉన్న అన్ని పదవులూ పంచేస్తాం అని ఆయన క్లియర్‌ గా చెప్పారు. అయితే నామినేటెడ్‌ పదవులకు అర్హులను వారికి తగ్గ పదవులను ఎంపిక చేసే బాధ్యతను ఆయన ముగ్గురు మంత్రుల బృందం చేతిలో పెట్టారు. దీంతో ఇప్పుడు తెలంగాణలోని ఆశావహులంతా కూడా ఆ ముగ్గురి చుట్టూ పదేపదే ప్రదక్షిణలు చేయడం జరుగుతోంది.
 
ఈ బృందంలో తన్నీరు హరీశ్‌రావు - తుమ్మల నాగేశ్వరరావు - పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. నిజానికి నామినేటెడ్‌ పదవులు పొందగలవారిని వెతకడానికి కులాల సమతూకం పరంగా కమిటీని బాగనే ఏర్పాటుచేశారు గానీ అక్కడ వ్యవహారాలు ఒక కొలిక్కి రావడం లేదు. ఇప్పుడు ఆశావహులైనా వారిని సిఫారసు చేయదలచుకున్న ఇతర మంత్రులైనా.. అచ్చంగా.. ఈ ముగ్గురి చుట్టూ తిరగాల్సిందే.
 
తాజాగా ఈ పోస్టుల వ్యవహారంపై కేేసీఆర్‌ సమీక్ష కూడా నిర్వహించారు. సమీక్షలో ఇతర మంత్రులు కడియం - ఈటెల - ఇంద్రకరణ్‌ కూడ పాల్గొన్నారు. కానీ రెండు మూడు రోజుల్లో జాబితాలు సిద్ధం అవుతాయని.. బహుశా విజయదశమి తర్వాత పదవుల పందేరం ముమ్మరంగా ఉండచ్చునని అనుకుంటున్నారు. మొత్తానికి పండగ తరువాత.. తెరాస పార్టీని కూడా కొత్త జోష్‌ తో ముందుకు నడిపించడానికి కేసీఆర్‌ సిద్ధం అవుతున్నారన్నమాట.
Tags:    

Similar News