మోడీ నోట 'కుటుంబ'అన్న మాట రాగానే కస్సుమన్న హరీశ్.. ముందే ఇవన్నీ చెప్పలేదేం?
నాకిది చేయ్.. నీకు ఇది చేస్తాననే క్విడ్ ప్రో అందరికి సుపరిచితమే. అయితే.. పెద్దగా ప్రచారంలో లేదు కానీ రాజకీయాల్లో గడిచిన కొంతకాలంగా ఒక విధానాన్ని పాటిస్తున్నారు. 'నిన్ను నేను ఏమీ అనను. నువ్వు నన్ను ఏమీ అనకు' అంటూ కొన్ని పార్టీల మధ్య తెర వెనుక ఒప్పందం జరగటం.. అందుకు తగ్గట్లే వ్యవహరించటంకొంతకాలంగా చూస్తున్నాం. లెక్కలు ఎక్కడ తేడా కొట్టాయో కానీ.. మోడీని ఆకాశానికి ఎత్తేసే సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో తెగ కోపడ్పడిపోవటం.. దేశాన్ని మార్చేయాలన్న కంకణం కట్టుకోవటం తెలిసిందే.
వ్యవసాయ చట్టాల మీద దేశ వ్యాప్తంగా అంత భారీగా నిరసనలు.. ఆందోళనలు జరిగినప్పుడు కిమ్మనకుండా ఉండిపోయిన కేసీఆర్.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా మోడీ వ్యతిరేక శక్తుల్ని ఒక చోటుకు చేర్చటమే కాదు.. దేశ రాజకీయాల్ని మార్చేస్తానని చెబుతున్నారు.
కేసీఆర్ అన్నేసి మాటలు అన్నప్పుడు తాము మాత్రం తక్కువ తిన్నామా? అన్నట్లుగా మొన్నటికి మొన్న తెలంగాణకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు చేస్తే.. తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా యుద్దానికి తెర తీశారు. తెలంగాణ కుటుంబ పాలనలో చిక్కుకుపోయిందని.. అమరవీరుల త్యాగాలు ఒక కుటుంబానికా? అంటూ సూటిగా చేసిన వ్యాఖ్యలు అంతో ఇంతో ప్రభావాన్ని చూపటం ఖాయం. మోడీ వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల స్పందన ఏమిటన్న దాని కంటే కూడా.. తెలంగాణ రాష్ట్ర సమితి హాహాకారాలే ఇప్పుడు మిన్నంటుతున్నాయి.
బేగంపేట విమానాశ్రయంలో కుటుంబ పాలన మీద మోడీ నోటి నుంచి మాటలు వచ్చిన కాసేపటికే మంత్రి హరీశ్ రావు కస్సుమన్నారు. మోడీ మాటల్ని తప్పు పట్టిన ఆయన.. బీజేపీలోనూ కుటుంబ పాలన ఉందన్న కొత్త విషయాన్ని సరికొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు.
అమిత్ షా కుమారుడు బీసీసీఐకి సెక్రటరీ అయ్యారని.. ఆయనేమైనా క్రికెటరా? దీనికి మీ సమాధానం ఏమిటి? అని ప్రశ్నించారు. అమిత్ షా కొడుక్కి ఆ పదవి దక్కటం తప్పు అయితే.. ఇన్నాళ్లు నోరెందుకు తెరవలేదు? క్రికెట్ ఆడే హరీశ్ రావు.. ఆ క్రీడా రంగానికి చెందిన చాలా విషయాల్లో పట్టుంది. అలాంటప్పుడు తప్పుడు రీతిలో పదవిని చేపట్టి ఉంటే.. ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి ఉతికి ఆరేయాలి.
ఇంతకాలం ఆ విషయాన్ని ప్రస్తావించని హరీశ్.. ఈరోజున తమను ఉద్దేశించి ఒక్క మాట అన్నంతనే.. మోడీషాల లోటుపాట్లను అర్జెంట్ గా ప్రజలకు చెప్పేయాలన్న తపన.. తాపత్రయం చూసినప్పుడు..'ఇంతకాలం ఏం చేశావ్ నాయనా?' అని ప్రశ్నించాలనిపించక మానదు. విమర్శించే ముందు.. ఇప్పటివరకు ఎందుకు విమర్శించలేదన్న విషయాన్ని చెప్పిన తర్వాత గళం విప్పితే బాగుంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. దీనికి హరీశ్ మాష్టారు ఏం సమాధానం చెబుతారు?