ప‌వ‌న్ కు రాజ‌కీయ ప‌రిజ్ఞానం లేదు:హ‌ర్ష కుమార్

Update: 2018-02-05 12:43 GMT
ప్ర‌జ‌ల త‌ర‌పున ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డానికే తాను వ‌స్తున్నానంటూ...... సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ జనసేన పార్టీని నాలుగేళ్ల క్రితం స్థాపించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ప‌వ‌న్ మాత్రం కొన్ని ప్ర‌త్యేక స‌మ‌స్య‌ల‌పై మాత్ర‌మే...అదీ కూడా ఒక స్థాయి వ‌ర‌కే ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చి నొప్పించ‌క‌....తానొప్ప‌క అన్న రీతిలో ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. అంత‌క‌ముందు ఏపీ వ‌ర‌కే ప‌రిమితమ‌యిన ప‌వ‌న్ `ప్ర‌శ్న‌ల` ప‌రంప‌ర తాజాగా తెలంగాణ‌కు చేరింది. దీంతో, ప‌వ‌న్ పై తెలంగాణలో ప్ర‌తిప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి. ఇన్నాళ్లూ తెలంగాణ వైపు క‌న్నెత్తి చూడ‌ని ప‌వ‌న్ ఒక్క‌సారిగా కేసీఆర్ పై - తెలంగాణ పై వ‌ల్ల‌మాలిన ప్రేమ చూపించ‌డంపై అక్క‌డి ప్ర‌జ‌లు కూడా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.  రాబోయే ఎన్నిక‌ల్లో ఏపీతో పాటు తెలంగాణలో కూడా పోటీ చేస్తానని పవన్ ప్రకటించిన నేప‌థ్యంలో జ‌నసేనాని పై ఇరు రాష్ట్రాల నుంచి `రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌` దాడి మొద‌లైంది. తాజాగా, ప‌వ‌న్ పై అమలాపురం మాజీ ఎంపీ - సీనియర్ పొలిటీషియ‌న్ హర్ష కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ కు  రాజకీయాలపై స్పష్టత లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు.

తిరుపతిలో జ‌రిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హ‌ర్ష కుమార్ ప‌వ‌న్ పై  ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పవన్ తో పోలిస్తే ఆయ‌న సోద‌రుడు చిరంజీవి నయ‌మ‌ని అన్నారు. పవన్ కు కనీసం చిరంజీవికి ఉన్నంత రాజకీయ పరిజ్ఞానం కూడా లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నించ‌డానికి వ‌చ్చాన‌ని చెప్పిన ఆయన ఎప్పుడు ప్రశ్నిస్తాడో? ఎప్పుడు జవాబు ఇస్తాడో ఆయనకే తెలీదు.....అని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌శ్నిస్తా అని ఓట్లు అడిగిన ప‌వ‌న్....ఇప్పుడు ప్రశ్నించడం కూడా మర్చిపోయాడని అన్నారు. ఆ మాట‌కొస్తే ప‌వ‌న్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాడో లేదో కూడా తెలియ‌ద‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సమైఖ్యాంధ్ర ఉద్యమం సంద‌ర్భంగా కాంగ్రెస్ నుండి హ‌ర్ష కుమార్ సస్పెండ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన పార్టీ త‌ర‌పున 2014 లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత రాజకీయాలకు దూరంగానే ఉంటున్న హ‌ర్ష‌కుమార్ ......కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ పోలవరం సభలో ప్రత్యక్ష‌మ‌య్యారు. దీంతో, ఆయ‌న మ‌ళ్లీ సొంత‌గూటికి చేర‌తార‌నే పుకార్లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News