ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్ స్టీన్ న్యూయార్క్ పోలీసుల ముందు లొంగిపోయాడు. 66 ఏళ్ల ఈ హాలీవుడ్ మొఘల్ తమను రేప్ చేశాడని, లైంగికంగా వేధించాడని పదుల సంఖ్యలో హీరోయిన్లు ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబర్ లో న్యూయార్క్ లో వైన్ స్టీన్ వేధింపుల గురించి సవివరంగా ఓ ఆర్టికల్ రాసింది. తనను రేప్ చేశాడని నటి పాజ్ డీ లా హుయెర్టా చేసిన ఆరోపణపై న్యూయార్క్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ ప్రొడ్యూసర్ అలెగ్జాండ్రా కనోసా కూడా న్యూయార్క్‌లో కోర్టులో కేసు వేసింది. ఐదేళ్లుగా వైన్‌స్టీన్ తనను రేప్ చేశాడని, లైంగికంగా వేధించాడని, తిట్టాడని ఆ పిటిషన్‌లో చెప్పింది.
హీరోయిన్ల ఆరోపణల పర్వం ప్రపంచవ్యాప్తంగా ``మీటూ`` ప్రచారానికి తెర తీసిన విషయం తెలిసిందే. అయితే హీరోయిన్లతో పరస్పర అంగీకారం లేకుండా తానెప్పుడూ సెక్స్‌లో పాల్గొనలేదని అతను చెబుతూ వచ్చాడు. కాగా, ఉదయాన్నే స్టేసన్‌కు వచ్చిన వెయిన్‌స్టీన్ తెల్ల షర్ట్ - డార్క్ డెనిమ్ జీన్స్ ధరించి - చేతిలో పుస్తకాలు పట్టుకుని ఉన్నారని అధికారులు చెప్పారు. నటి లూసియా ఇవాన్స్ చేసిన ఆరోపణలపై పోలీసులు వైన్‌స్టీన్‌పై కేసు నమోదు చేయనున్నారు. ఇతర హీరోయిన్లు చేసిన ఆరోపణల ఆధారంగా కూడా అతనిపై కేసులు నమోదు చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.మాన్‌హాటన్ క్రిమినల్ కోర్టులో వైన్‌స్టీన్‌ను హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయని సమాచారం.