ప‌కోడీలు కొని మ‌రీ పంచ్ వేసిన సీఎం

Update: 2018-03-06 17:17 GMT
రాజ‌కీయాల్లో ఉన్న వారంతా అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఏ మాత్రం అప్ర‌మ్త‌తంగా ఉన్నా జ‌రిగే న‌ష్టం అంతా ఇంతా కాదు. తాజాగా అలాంటి ముప్పును త‌ప్పించుకోవ‌ట‌మేకాదు.. స‌మ‌య‌స్ఫూర్తితో ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయ పార్టీ నేత‌ల‌పై పంచ్ విసిరారు. ప‌కోడీలు అమ్ముతున్న విప‌క్ష నేత‌ల వ‌ద్ద‌.. డ‌బ్బు పెట్టి మ‌రీ ప‌కోడీల్ని కొన్న ఆయ‌న భారీ పంచ్ వేశారు. ఇంత‌కీ జ‌రిగిందేమంటే..

కేంద్రం.. రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు యూత్‌కు ఉద్యోగాల్ని ఇవ్వ‌టంలో ఫెయిల్ అయ్యిందంటూ హ‌ర్యానా కాంగ్రెస్ నేత‌లు వినూత్న రీతిలో నిర‌స‌న చేప‌ట్టారు. ఇటీవ‌ల కాలంలో ప‌కోడీలు అమ్మి రోజుకు రూ.200 సంపాదించ‌టం కూడా జాబేన‌ని ప్ర‌ధాని మోడీ వ్యాఖ్యానించారు. ప‌వ‌ర్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఉద్యోగాలు పెద్ద ఎత్తున తీసుకొస్తామ‌ని చెప్పిన బీజేపీ నేత‌లు.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడ‌టంపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఇదిలా ఉండ‌గా.. తాజాగా హ‌ర్యానాకు చెందిన విప‌క్ష నేత‌లు పకోడాలు  అమ్ముతూ నిర‌స‌న తెలిపే ప్లాన్ వేశారు. ఎన్నిక‌ల వేళ‌లో పెద్ద పెద్ద హామీలు ఇచ్చార‌ని.. ఉద్యోగాలంటూ వాగ్దానాలు చేసి ఇప్పుడేమో ప‌కోడా ఉద్యోగాలు అంటున్నారంటూ కాంగ్రెస్ నేత‌లుఎద్దేవా చేస్తున్నారు.

స్టేట్ అసెంబ్లీ వ‌ర‌కూ ప‌కోడీ బిస్కెట్ల‌ను తీసుకొని ప్ర‌ద‌ర్శ‌న‌గా వెళ్లిన కాంగ్రెస్ నేత‌లు రోడ్ల మీద‌నే ప‌కోడాల వ్యాపారాన్ని షురూ చేశారు. కాంగ్రెస్ నేత‌ల నిర‌స‌న‌కు ప్ర‌జ‌ల్లో భారీ స్పంద‌న ల‌భించింది. ప‌లువురు రోడ్ల మీద వెళ్లే వారు ఆగి మ‌రీ కొన‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. హ‌ర్యానా రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఖ‌ట్టార్ త‌న వాహ‌నంలో వెళుతూ.. కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న నిర‌స‌న కార్య‌క్ర‌మం ద‌గ్గ‌ర ఆపి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ‌ద్ద ప‌కోడీలు కొనుగోలు చేశారు.

అనంత‌రం ఆయ‌న తాను కొన్న ప‌కోడీల‌పై ఆస‌క్తిక‌రంగా వ్యాఖ్యానించారు. ప‌కోడీలు అమ్ముతూ ఎవ‌రైనా ఉపాధి పొందితే మంచిదే క‌దా.. వాళ్లు నిరుద్యోగులు కావ‌టంతో ప‌కోడీలు అమ్ముతున్నారంటూ చుర‌క వేయ‌టంతో.. ప‌కోడాలు అమ్మ‌టం ద్వారా పంచ్ వేద్దామ‌నుకున్న కాంగ్రెస్ నేత‌ల‌కు రివ‌ర్స్ గేర్ లో పంచ్ ప‌డిన ప‌రిస్థితి.
Tags:    

Similar News