కరోనా వైరస్ భారత్ లో విలయతాండవం చేస్తున్న సమయంలో హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి చేసిన ఓ కీలక ప్రకటన చేసింది. ఐసీఎంఆర్ తో కలిసి హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కోవ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ శుక్రవారం హర్యానాలోని రోహ్తక్లో ఉన్న పోస్ట్ గ్యాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రారంభమైనట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇప్పటికే భారత్ లోని పలుచోట్ల భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.
రోహతక్ లోని పీజీఐ హాస్పిటల్ లో కోవిడ్ రోగులకు కోవాక్సిన్ టీకాను వేసినట్లు హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ముగ్గురికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆయన తన ట్విట్టర్‌లో ఇవాళ తెలిపారు. అలాగే , కోవాక్సిన్ మందును తీసుకున్న వారు క్షేమంగా ఉన్నారని, వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు అని తెలిపారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ .. కరోనా వైరస్ ను అరికట్టడానికి ఈ కోవాక్సిన్ మందుని తయారు చేసిన విషయం తెలిసిందే.