ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టడానికి ఇప్పుడు అన్ని ఫార్మా సంస్థలు వ్యాక్సిన్ వేటలో పడ్డాయి. మన దేశంలో ప్రస్తుతం ‘కోవ్యాక్జిన్’ కరోనా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ జరుపుకుంటోంది.
తాజాగా కోవ్యాక్జిన్’ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రయోగాలు హర్యానాలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఏకంగా హర్యానా రాస్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ ఈ ప్రయోగాత్మక వ్యాక్సిన్ వేసుకోవడం విశేషం.
అంబాలాలోని ఆసుపత్రిలో డాక్టర్లు ఆయనకు కరోనా వ్యాక్సిన్ డోస్ ను ఎక్కించారు. ఈ కార్యక్రమాన్ని ఐసీఎంఆర్ భారత ప్రభుత్వ నిపుణులు పర్యవేక్షించారు.
ఇన్నాళ్లు సామాన్యులకు, వలంటీర్లకు మాత్రమే వేసిన ఈ వ్యాక్సిన్ తాజాగా ఓ మంత్రిపై ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Full View Full View Full View

ఈ కోవ్యాక్జిన్ వ్యాక్సిన్ ను హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. రెండు తెలుగు రాస్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ ను ఐసీఎంఆర్ ప్రారంభించారు. తొలి, రెండో దశ ప్రయోగాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ రెండు ట్రయల్స్ విజయవంతం కావడంతో మూడో ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా 26వేల మందిని ఎంపిక చేసి నిర్వహిస్తున్నారు. ఈ దశ దాటితే ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.