ఈ నెలాఖ‌రుకి స‌రస్వ‌తి న‌ది క‌నిపించ‌నుంది

Update: 2016-07-21 09:47 GMT
వేద‌కాలంలో ఉంద‌ని చెప్పుకునే అత్యంత ప‌విత్ర న‌ది స‌ర‌స్వ‌తి.. ఎన్నో ఏళ్ల కింద‌ట ఎండిపోవ‌టం.. అది ఉండద‌న్న విష‌యం కూడా తెలీద‌న్న‌ట్లుగా మార‌టం తెలిసిందే. హిందువులు అత్యంత ప‌విత్రంగా పూజించే ఈ న‌ది జాడ‌లు క‌నుగొనేందుకు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. భార‌త సంస్కృతికి.. ఆత్మ‌ను ఆవిష్క‌రించే స‌ర‌స్వ‌తి న‌దిని పున‌రుద్ధ‌రించాల‌న్న ల‌క్ష్యంతో జ‌రిగిన ప్ర‌య‌త్నాలు తాజాగా స‌త్ ఫ‌లితాలు ఇస్తున్నట్లుగా చెప్పొచ్చు.

ఈ న‌దిని పున‌రుద్ధ‌రించుకునేందుకు హ‌ర్యానా ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. స‌ర‌స్వ‌తి వార‌స‌త్వ అభివృద్ధి మండ‌లి ఆమోదించిన ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం ఈనెల 30న దాదుపూర్ ఫీడ‌ర్‌ ద్వారా ఊంచా చంద‌న గ్రామం నుంచి న‌ది ప్ర‌వాహ మార్గంలో భారీగా నీటిని విడుద‌ల చేస్తారు. స‌ర‌స్వ‌తి న‌ది ప్రారంభ స్థాన‌మైన ఆదిబ‌ద్రి వ‌ద్ద ఆన‌క‌ట్ట‌ను నిర్మించాల‌న్న ల‌క్ష్యంతో ఉన్న హ‌ర్యానా స‌ర్కార్ ఆ ప‌నిలో విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుందాం.
Tags:    

Similar News